పుట:Kavijeevithamulu.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

484

కవి జీవితములు.

రక్షించుచు అందుమీఁద కర్ణాటకదేశములో నున్న పాలెగాండ్రు కప్పమీయకున్న వారితో యుద్ధము చేసి జయించి, మళయాల, కేరళములలో విజయరాజుతో బహుయుద్ధము చేసి జయించి, అతనివలన ననేకద్రవ్యముం దీసుకొని పాండ్యరాజుతో స్నేహముచేసి, చోళద్రవిడదేశములలోఁ గప్పము తీసుకొని అక్కడనుండి యుత్తరదేశములకుం బోయి కళింగ, బంగాళ దేశరాజుల జయించి, అనేక తురుష్కులం జయించి గజపతిరాజుం జంపి, గంగరాజును జయించి వచ్చిన ఆమంత్రికి "విజయోద్దండేంద్రుఁ"డని బిరు దిచ్చెను. ఈనరసింగరాయనికి రాజాధిరాజు రొందరలేశ్వర మహారాయ లని పేరు పెట్టిరి." అని యున్నది. ఇట్టిచారిత్రవిశేషము లితరగ్రంథసహాయము లేనిది సిద్ధాంతములుగా నెంచఁబడఁగూడదు. కావున పైమనుచరిత్ర పారిజాతాపహరణములలో నుండు కొన్నిపద్యములంబట్టి కొంత నిర్ణయింతము. అందు మనుచరిత్రములో నరసింహరాజుయొక్క ప్రతాపము విశేషముగ వర్ణింపఁబడియెంగాని, యేయేస్థలములలో నేయేప్రతాపముఁ జూపెనో వ్రాయంబడి యుండ లేదు. ఇఁకఁ బారిజాతాపహరణములో :-

"సీ. ఎవ్వనివిజయంబు లెఱిగించుశాసన, స్తంభంబు లాశాంతశైలవితతు
      లెవ్వానియరిగాపు లేపారుకాళింగ, యవనాదివిదిధదేశాధినాథు
      లెవ్వానినిత్యదానైకవిలాసంబు, లారూఢతరతులాపూరుషంబు
      లెవ్వానిచిరగీర్తి యింద్రలోకాంగనా, భోగినీగీతికాభోగపదము

తే. వాఁడు వొగడొందు సర్వసర్వంసహాధి, దేవతాముఖదర్పణద్విజయనగర
    భద్రసింహాసనస్థుఁ డున్నిద్రతేజుఁ, డీశ్వరాధిపునరసభూమీశ్వరుండు.

సీ. కుంతలేశ్వరుఁడు పిక్కువడంగ విద్యాపు, రంబు గైకొని నిజప్రౌఢి నెఱ పెఁ
    బారసీకునకు దుర్భరమానసత్వంబుఁ, దొలఁగించె మానవదుర్గసీమఁ
    జోళవల్లభునకు సురవధూమధురాధ, రము లిచ్చి మధురాపురంబుఁ గొనియె
    శ్రీరంగపట్టణసీమ ఖడ్గనటీవి, నోదంబు యావనేంద్రునకుఁ జూపె

తే. నతఁడు నుతికెక్కె రామసేత్వఁతరాళ, కలితషోడశదానవిఖ్యాతయశుఁడు
    మండలీకరమేఘమార్తాండబిరుదుఁ, డీశ్వరాధిపునరసపృథ్వీశ్వరుండు.'