పుట:Kavijeevithamulu.pdf/489

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
483
శ్రీ కృష్ణదేవరాయలు.

    మార్గణగణపిక మధుమాసదివసంబు, గుణరత్న రోహణక్షోణిధరము
    బాంధవసందోహపద్మవనీహేళి, కారుణ్యరసనిన్ను గాక శత్రుఁ

తే. డన జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె, ధరణిథవదత్తవివిధోపదావిధాస
    మార్జితశ్రీవినిర్జిత నిర్జరాల, యేశ్వరుఁడు తిమ్మభూపతి యీశ్వరుండు."

నరసింహరాజు.

పై ఈశ్వరరాజు కుమారులు నరసింహరాజు, తిమ్మరాజు. నరసింహరాజు వృత్తాంతము పై రెండు గ్రంథములలోనే కాక 'కొంగదేశరాజకాల్‌' అను గ్రంథములోను, 'విజయనగర రాజులచరిత్రము' అనుదానిలోఁగూడ నున్నది. కావున మొదట మనుచరిత్రములో నున్న దానిం దెల్పెదము.

"క. ఆయీశ్వరనృపతికిఁ బు, ణ్యాయతమతి యైనబుక్కమాంబకుఁ దేజ
     స్తోయజహితు లుదయించిరి, ధీయుతు లగునారసింహ తిమ్మనరేంద్రుల్."

ఇట్లు చెప్పి యనంతరము నరసింగ రాజు విశేషములు మాత్రము కొన్ని వివరింపఁబడినవి. ఇటులనే పారిజాతాపహరణములోఁగూడ నీశ్వర రాజు కుమారుల యిర్వురపేరులును వివరింపఁబడినవి. [1]అందుఁగూఁడ నరసింగరాయని వృత్తాంతమే వివరింపఁబడెనుగాని తిమ్మరాజుంగూర్చిన విశేషములు వివరింపఁబడవాయెను. కావున మన మిపుడు నరసింగ రాయనివిశేషములే వ్రాయవలసియున్నది. ఇఁక తిమ్మరాజునుగూర్చి చెప్పవలసినవృత్తాంత మొకటి యున్నది. అందులో ఈతిమ్మరాజే కృష్ణదేవరాయనిప్రసిద్ధమంత్రి యగుతిమ్మరు సని కొందఱూహించుచున్నారు. అది సరియైనది కానట్లు కొన్నిగ్రంథదృష్టాంతము లుండుటంబట్టి ఆసంవాదము మఱియొకస్థలములోఁ జూడఁదగు నని చెప్పి ప్రస్తుతము నరసింగరాయనికథలోనికి దిగెదను. కో. రా. లో 47 "నరసింగరాయపట్టము" ఇతఁ డుద్దండుఁ డనుమంత్రితోఁగూడి తెన్గుదేశము

  1. ఇది పొరపాటు. పారిజాతాపహరణమున నిద్దఱుకొడుకుల పేరులు లేవు. ఉన్న దొక్కటే. అచట తిమ్మయయీశ్వరనృపతికిన్ = తిమ్మరాజుకొడుకు కగునీశ్వరరాజునకు, అని యన్వయింప నొప్పును.