పుట:Kavijeevithamulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కవి జీవితములు



న మయిన పిమ్మట నాసమీపమున నుండుబీజపూరు (Bijapore) ఆదేశమునకు ముఖ్యపట్టణ మాయెను. ఆసంస్థానమునకుంగూడ బీజపురరాజ్య మనియే పేరు గలిగెను. అయితే మైలమభీమనకాల మగు శాలివాహన సం. 975 (A. D. 1053) నాఁటికి కల్యాణపుర మనునామమే కలదు. [1]

35. సేతుసీతాచలాస్తోదయాద్రిబిరుదశాసన స్తంభవిభ్రాజితుఁడు - వీరివంశస్థులలో నొకమాధవవర్మ యనురాజు దిగ్విజయార్థము కృష్ణదేవరాయలకాలము నాఁడు బయలుదేరి యనేకస్థలములు జయించి సేతువువఱకును దనజయ స్తంభములు పాతించినట్లు గ్రంథములలో దృష్టాంతము గలదు.

36. భారుహమన్నెగండపెండేర విరాజితుఁడు - దీనికిఁ బాఠాంతరమే యర్థముగా నుండును. ఎట్లన్నను, భారుహమన్యరాజన్యకోటీరకోటిహీరచారు శుష్యమాణసమాశ్రితపాదపంకజుఁడని.

37. కళింగరాయ ప్రళయకాలాభీలుండు - ఇందలికళింగ రాయఁడు రాజకళింగగంగు కానోవును. లేదా కళింగరా జని యయిన ననవచ్చును. మయిలభీమనయును, రాజకళింగగంగును నేకకాలీనులు కావున మొదటియర్థమే యనుకూలించి యుండును.

38. కిమిడిరాయమానవిభాళుఁడు - దీనిపాఠాంతరము కిమిడెరాజ మానతిమిరార్కుం డని యున్నది.

39. గంగిమంగితలగుండుగండఁడు -

40. మండలీకరగండఁడు -

41. కరవాలరుద్రుండు -

42. విమతవీరభద్రుండు -

  1. ఒక యాంగ్లేయచారిత్రములో, (The capital of the Western Chalukyas was Kalyan or Kalyanapura Someswara. Trylokya mallawas ruling over it as early as in 975 Saka (1053. A. D.) అని యున్నది. ఈబిరుదువలన నీవంశస్థులు కళ్యాణరాజును జయించి యారాజ్య మాక్రమించినట్లు కాన్పించును.