పుట:Kavijeevithamulu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

373

పైనాల్గింటిలో మెట్లు (పర్దాలు)గలిగి యుండునది మొదటి మహతీవీణె యనియు, నాల్గవది కచ్ఛపివీణె యైయున్నట్లును స్పష్టమే గదా. ఈరెంటికే వీణె యనునామ మిపుడు సర్వత్ర వాడుకొనఁబడుచున్నది. అందు మహతి మధ్యమశ్రుతి గలదియును, కచ్ఛపి షడ్జమశ్రుతి గలదియు నై యున్నవి. ఇట్టిభేదములు ప్రథమవీణెలో మొదటిశ్రుతిలో మకారము పల్కుటంబట్టియును, రెండవకచ్ఛపివీణెలో మొదటిశ్రుతిలో నకారము బల్కుటంజేసియు నేర్పడినవి.

సప్తస్వరములలోను, న, ప అనునవి రెండును కళలు అనఁగా శ్రుతిపర్యాయములు. తక్కినయైదు ననగా, రి, గ, మ, ధ, ని, పేరుగల స్వరములు హెచ్చు తగ్గు స్వరములు గలవియై రెండేసి యయినవి. ఈ పదియును పై. న. ప స్వరములు కలిసిపండ్రెండు (12) స్వరములైనవి.

మేళవించుటను గూర్చి.

దీని నుత్తరదేశీయభాషలో "టాట్" అని వాడెదరు. ఇట్టి టాట్ చలము, అచలము నని రెండువిధములు గలది. అనఁగా వీణె యొక్కమెట్లు రాగానుసారముగాఁ గొంచెముక్రిందికిని మీఁదికిని జరుపుకొనవలసియున్నది. ఈయాచారమే పూర్వము విశేషమైయున్నట్లు కనఁబడును. చితారు అనునుత్తరదేశీయ సంగీతవిద్యాసాధన మిప్పటికి నిట్లే యున్నది. ఈవిధముగనే రుద్రవీణెకును, కచ్ఛపివీణకును చల టాట్ మార్గము స్వభావసిద్ధ మైనట్లు కానుపించును. అయితే కొందఱు బుద్ధిశాలు రట్టిదానిలో రాగములు మార్చుటలోఁ గల్గుభేదములు చిక్కులు నాలోచించి దాని నచలటాట్ గాఁ జేయ యత్నించిరి. అపు డుత్తరదేశస్థు లొకవిధముగా దాని నచలముం జేసిరి. అందుకు గా నింకొక యెనిమిదిస్వరములు గలయావృత్తమునకుం దగిన మఱియెనిమిది మెట్లు (పరదాలు) చేర్చి మొత్తమునకు నిరువది (20) మెట్లును బిగించిరి.