పుట:Kavijeevithamulu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

కవి జీవితములు

ము నుత్సహింపము రా. కృ. గారి ఆక్షేపణలు ధర్మశాస్త్రసంరక్షకములనియు నిర్దుష్టములనియు, సిద్ధాంతీకరించెదము.

(7) ఇందులో రా. కృ. గారు నరసభూపాలీయకవి వేఱనియు నతనిపేరు మూర్తి (లేక మూర్తిరాజు) అను భట్టుమూర్తి యనియును, వసుచరిత్ర హరిశ్చంద్రనళోపాఖ్యానముల రచియించినకవి పైకవికి వే ఱై రామరాజభూషణనామమున వ్యవహరింపఁ బడువాఁ డనియు, నాయిర్వురు నొక్కరే యని యిదివఱకు భ్రమపడుటకుఁ గారణములు కొన్ని యున్నను అవి యన్నియు బూర్వపక్షములుగా భావింప వలయు నని చెప్పిన సిద్ధాంతవచనము నీయుపన్యాసారంభములో మేము చూపినగ్రంథసాక్ష్యనిదర్శనములంబట్టి జిగిపడినదై పుక్కిటిపురాణగాథలను నిర్మూలముచేసి యిఁక బూర్వపక్షోక్తి శతముల కైన కదలింపరాని పూనాది గల దైన దని మఱి మఱి వక్కాణించుచున్నాము.

కాకమానిమూర్తి యెవ రని.

కాకమానిమూర్తియే భట్టుమూర్తి అని యిదివఱలో నాకవిజీవితములో వ్రాసియున్న దనియు నట్లు వ్రాయుట కేవలము హాస్యాస్పద మని పూ. రామకృష్ణయ్యపండితుఁడు వ్రాసియున్న దానికి సమాధాన మీయక యిపుడు మనము వ్రాయుచున్న చారిత్రకథాభాగముల లోనికిం దిగ రాదు. అందువిషయమై చెప్పవలసినసమాధానము విశేషించి యుండదు. ఈకథావిషయమై భట్టుమూర్తింగూర్చియు, రామరాజభూషణుంగూర్చియు వ్రాయంబడినచారిత్రగ్రంథములో నీకాకమానిమూర్తింగూర్చి వ్రాసియుండలేదు. ఆభాగములో భట్టుమూర్తి యింటిపేరు ప్రబంధాంకమువా రనునట్లు నిశ్చయించియే 52 పుటలోఁ బ్రబంధాంకము సింగరాజు మూలపురుషుఁ డని చెప్పుటచేత సూచింప నై యున్నది. ఆవిషయమైనవేఱుసంవాద మున్నట్లు సూచన యైనఁ జేయంబడనిచోట మఱియొకవిధముగ శంకకల్గించుకొనుట కవకాశ ముండదు. నేను చారిత్రము వ్రాయుచో గ్రంథస్థగాథ లేవియో ఉదాహరణములతోను, గ్రంథస్థములు కానిగాథలను వాడుకనుబట్టియు వ్రాయుచున్నానని వివరించుచునే యుంటిని. దీనింగూర్చి ప్రస్తుతము నేను ప్రకటించిన రామకృష్ణునిచారిత్రములోఁ చూడవలయును. అ ట్లీ