పుట:Kavijeevithamulu.pdf/373

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

367

సిద్ధాంతములు పూర్వపక్షకోటిలోని వై ప్రస్తుతకాలములో నగ్రాహ్యము లయ్యె నని గ్రంథస్థ మగుసాక్ష్యమును బట్టి చెప్పవలయును.

(4) అందులో రామరాజభూషణుఁడు వేసికొనిన "శుభచిహ్న" అను దానికి క. వీ. గారు చెప్పినట్లు శుభ మనుబిరు అర్థము కాక రా. కృ. గారి సిద్ధాంతానుసారముగ నాందోళికాదిచిహ్నము లని చెప్పుటయే యుక్తము.

(5) "సంగీతకళారహస్యనిధి" నని వసుచరిత్రములో రామభూషణుఁడు వ్రాసియున్న దానికన్న వీణియకు మెట్లు కల్పించుటంజేసి కల్గె నను దానివృత్తాంతమంతయు నిపుడు ప్రకటింపవలసి యున్నది. దాని నిటుపైని సయుక్తికముగా విస్పష్టపఱుచుచున్నాను. కాని యందెచ్చటను రామభూషణుఁడు రచియించె నని వాడుకొనంబడుసంస్కృతాంధ్రకృతులు (పదకవిత్వము) గాని వానివిశేషములుగాని వివరింపఁ బడలేదు. ప్రబంధములలో సంస్కృతాంధ్రకృతు లావఱకే రచియించి యుంటి నని చెప్పినదానికి ప్రబంధములుగా నన్వయించుటయు, యక్షగానములు రచియించుగ్రంథములలోఁ గూడఁ సంస్కృతాంధ్రకృతు లని యున్నను పైరీతిని గ్రంథములే అని చెప్పుట సహజముగా నున్నది. సంగీతములో నుండుకృతు లనునామముతో నొప్పుప్రస్తుతగీతభేదములు నవీనము లనియుఁ బూర్వకాలములో నిట్టి నామ మున్నందులకు నిదర్శనములు గాని నిబంధనగ్రంథములలో వాని నిర్వచనములుకాని కానుపించుట లే దనియుం జెప్పవలసియున్నది. కావున నిందులోఁగూడ రా. కృ. గారిసిద్ధాంతమే సరియైన దని చెప్పవలసియున్నది.

(6) ఇందులో రామరాజభూషణుఁ డనుపేరితో నున్నకవి "సూరపాత్మజుఁడ" నని వ్రాసుకొనుటచేత నతని కితఁ డౌరసుఁ డనియు, నరసభూపాలీయములో "వేంకటరాయ భూషణనుపుత్త్రు" అని వ్రాసియుండుటచేత పైకవియే వేంకటరాయభూషణునకు దత్తుఁడని దృఢపఱుచుచున్నట్లు కొంద ఱనుచున్నాఁరని క. వీ. గారు వ్రాసినది అట్లు చెప్పువారికి ధర్మశాస్త్రజ్ఞానము లే దని సూచించుటకై యుండునుగాని వారిసిద్ధాంతబోధమునకుఁ గాదు. అట్లుగానిచో క. వీ. గారిధర్మశాస్త్రా భిప్రాయ మదియే యని యూహించుటకుఁ మే మెంతమాత్ర