పుట:Kavijeevithamulu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

327

యములైనవి. అనంతకాలములో శ్లేషకావ్యములం జెప్పినకవు లందఱును సూరనకవిమార్గమునే యవలంబించి నడీచిరిగావున సూరనమార్గమే శ్లేషకవనమునకు నిబంధనగ్రంథ మైనది. కావున నావిషయ మై విశేషించి వ్రాయ గమకింపను.

శయ్యాదులవిషయము.

సూరన శయ్యాదులంగూర్చి దక్షిణామూర్తిపండితుఁడు వ్రాసినవిశేషములో నేవి యంగీకరింపఁదగినవియో ఏవి పరిహరింపఁదగినవో వానినిమాత్రము వివరించెదను. అట్లు వివరింపకున్న నందలి గుణాగుణములు పాఠకులకు బోధపడకపోవును.

Critical Essas on Pingali Surana

PAGE 6.

ఉపన్యాసకాభిప్రాయము.

"సూరనార్యకవియుఁ గడుబాల్యమునందే కవితాకౌశలమును సంపాదించిన ట్లూహింపఁదగియున్నది."

చారిత్రకాభిప్రాయము.

లోకములోని కట్టుకథయే నిజ మగునేని సూరన బాల్యకాలములో విద్యాభ్యాసము లేక మూఢుఁడై తిరుగుచుండె ననియును. భార్యవంకవార లతనిం బరిహసింపఁగా నతఁడు రోషమున దేశాంతరమునకుఁబోయి విద్యాభ్యాసము చేసి పండితుఁడై వచ్చె ననియు, ననంతరము మఱికొంతకాలమునకు నతఁడు తనభార్యకుఁ దాత యగునల్లసానిపెద్దనం జూడఁబోవుడు నతనికవిత్వముం బరీక్షింప నొకపద్యముం జదువుఁడనుడు నపుడు.

"తలఁపం జొప్పడి యొప్పె నప్పుడు"

అనుపద్యము ప్రారంభింపఁగా ప్రారంభమునందే నాల్గువిఱువులా యని అడిగినట్లును, అందుపైని సూరనపద్యమంతయు విని యాక్షేపించిన బాగుగదా యనుడుఁ బెద్దన చదువు మనుడు.