పుట:Kavijeevithamulu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

కవి జీవితములు

21. భోగభామిని. ఆంధ్రదేశములో నవివాహిత స్త్రీసంతతికి సాను లని నామము గలదు. ఇందు సానిశాఖ, భోగముశాఖ, జక్కులశాఖ, కాళింగశాఖ మొదలగుశాఖ లనేకములు గలవు. పై యందఱకును భోగినీశాఖ యని పేరు. ఆస్త్రీ లిందు వర్ణింపఁబడిరి.

22. ఒడ్డెయువతి. ఓడ్రదేశమునుండి యాంధ్రదేశమునకు వచ్చి యుండువారికి "ఒడ్డె" లని పేరు. అందులో శిష్టికరణమనియు, పండాలనియు ఒడ్డెవారనియుఁ పలువిధనామములు గలశాఖ లున్నవి. కేవల లౌకికవ్యాపారము గల్గి చదువరులుగా వచ్చినశాఖవారిని "శిష్టుకరణము" లందురు. వర్తకవ్యాపారము చేసికొనుశాఖవారిని "పండా" లందురు. నీచకృత్యములం జేయు వారిని "ఒడ్డె" లందురు. ఈ పద్యములో నట్టి యొడ్డెలు చెప్పంబడిరి.

23. తమలపాకుల స్త్రీ. పైయోధ్రదేశపు శాఖలోని యాంధ్రులే తమలపాకులవ్యాపారముమాత్రము చేయువారిని పండా లని వ్యవహరింతురు. అట్టిపండాల స్త్రీ లిందు వివరింపఁబడిరి.

24. కుమ్మరిస్త్రీ. కుంభకారునియువిద.

25. చాకలియువతి. రజకి.

26. బిబ్బీలు. తురుష్కుల స్త్రీలు.

27. పింజారీ స్త్రీ. దూదేకులకుల మని వ్యవహరింపఁబడుశాఖ. ఈశాఖకు భాష ఆంధ్రము, మతము మహమ్మదీయము.

ఇట్లుగా దేశచారిత్రమునకు వలయువృత్తాంతములం దెల్పిన శ్రీనాథునివీధినాటకముంగూర్చి వ్రాయుచో నాగ్రంథమునకుం గలదోషములును, దానిని రచియించుటచేత శ్రీనాథునకుఁ గల్గినయపయశస్సును జెప్పవలసియున్నను, ఈవీథినాటకము చదివినతోడనే శ్రీనాథ కవి స్త్రీలోలుఁ డని జారుఁడని యుండుటచేతఁ దనకుం గలిగినయనుభవంబు నిట్లుగా గ్రంథస్థము చేసె నని పండితపామరు లందఱకును దోఁచకపోదు. అట్టియభిప్రాయము గలుగకపూర్వము లోకానుభవము