పుట:Kavijeevithamulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కవి జీవితములు



గ్రంథము ముగియునట్లుగాఁ దోఁచుచున్నది దానిక్రింద వ్రాయఁబడిన రెండుమూఁడుపద్యములును గద్యమును బై గద్యములో నవీనకల్పితములుగాఁ దోఁ చెడిని. యుద్ధకాండముతుదను వ్రాయఁబడినపద్య మిట వివరింతము. అ దెట్లన్నను :-

చ. అమర హుళిక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాం
   డముతరువాయి చెప్పె వికటప్రతిభాషణుఁ డప్పలార్యస
   త్తమసుతుఁ డయ్యలార్యుఁడు కృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
   హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్.

అను నిట్టివానిం బట్టిచూడఁగా రామాయణమును రచియించి నట్టి భాస్కరుఁ డొక్కఁడే కాని యిర్వురు కా రనియును, నతనికే "సకలసుకవిజనవినుత యశస్కరభాస్కరుఁ డనియును, హుళిక్కి భాస్కరుఁ డనియును నామము లనియును నూహింపనై యున్నది. ఇదివఱలో సూచింపఁబడిన కారణములచేత నితఁడే గుంటూరిప్రభునిమంత్రి యగుభాసరుఁడనియుఁ దిక్కనసోమయాజికి దాత యనియు నూహింపఁదగి యున్నది. గుంటూరివిభుఁ డెవ్వరోమాత్ర మూహింపఁజాల కున్నారము. తిక్కన నెల్లూరిప్రభుఁడగు మనుమసిద్ధికడ నున్నట్లు ప్రసిద్ధి గలదు. ఇతని పూర్వులు మనుమసిద్ధికిఁ బూర్వులకడ నుండుట సహజము. అట్లు గానుపించక తిక్కనయొక్కపూర్వులు గుంటూరివిభునికడ నున్నట్లుగాఁ గాన్పించును. పైపద్యములో "గుంటూరివిభున్ మంత్రిభాస్కరు" నని విడఁదీసినచో గుంటూరికి మిరాసీదా రని కాని మొఖాసాదారని కాని కూడ నర్థము చెప్పవచ్చును; గ్రంథదృష్టాంతము లేదు గావున నీవిషయము ముగించి, యిట్టిగుంటూరి విభునికడ మంత్రిగా నున్న భాస్కరుఁ డనేకపదపద్యముల నంది యుండుటంగూర్చి యోజింతము. ఇప్పుడు మనము మాటలాడుకాలములో దేశచారిత్ర మేమియును దెలియదు. దేశములో నాభాస్కరుఁ డేయేఘనకార్యములు చేసి పదపద్యము లందెనో దాని నూహింప నలవి కాక యున్నది. అట్టి పదపద్యము లేమయిన నున్నవా యనియు సంశయింపవలసియున్నది. ఆంధ్రకవిచరి