పుట:Kavijeevithamulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హుళిక్కి భాస్కరుఁడు

133



రామాయణమును రచియించినభాస్కరునకు మల్లికార్జునభట్టారకుండనుపుత్త్రుఁ డున్నట్లు స్పష్టమే. ఇతనినే మల్లన యని చెప్పినఁ జెప్ప నొప్పును. వీనింబట్టి చూడఁగా రామాయణగ్రంథకర్త యగుభాస్కరుఁడే తిక్కనసోమయాజికిఁ దాత యగుభాస్కరుఁ డని చెప్పఁదగి యున్నది.

కాని కొందఱమతముచేతను హుళిక్కిభాస్కరుఁడును, మంత్రి భాస్కరుఁడును వేఱని యున్నది. దానికి వారిచేఁ జెప్పఁబడిన కారణ మేమనఁగా హుళిక్కి భాస్కరునిగద్యము "శ్రీమదష్టభాషాకవిమిత్త్రే" త్యాది యైనట్లు బాల కాండాదులు రచియించినమల్లికార్జునభట్టుగద్యము చేతను, యుద్ధకాండశేషమును రచియించిన యయ్యలార్యునిగద్యము చేతను దెలియవచ్చు చున్నట్లు నున్నది. ఇది యెంతవఱకు సయుక్తికమౌ యాలోచింతము. బాలకాండము, కిష్కింథాకాండము, సుందరకాండము వీనితుదను "అష్టభాషాకవిమిత్త్రకులపవిత్రభాస్కరసత్కవిపుత్ర" అని యున్నది. ఈ మొదటివిశేషణము భాస్కరుని కన్వయించి యీసందేహముల నందుచున్నారు. ఇవి మల్లి కార్జునభట్టునకే విశేషణము లేల కాఁ గూడదు? ఆపక్షములో నరణ్యకాండాంతములో నున్న "సకలసుకవిజనవినుతయశస్కరభాస్కరప్రణీతం బయిన" యనుగద్యము పై దానిని బాధింపదు. ఇఁక నయ్యలార్యుఁడు యుద్ధకాండాంతమున వ్రాసినగద్యములో నుండు "అష్టభాషాకవిమిత్త్రకులపవిత్రభాస్కరసత్కవిమిత్త్రాయ్యలార్యరచితం బయిన" యనుదాని నాలోచింపవలసి యున్నది. ఇక్కడ నైన నీబిరు దయ్యలార్యునకును గలదా యని యూహింప వలసి యున్నది. అది యెట్లనఁగా :-

"ఇది శ్రీశాకల్ల్యమల్లకవివరరామనృసింహవరజాప్పలార్యవరనందనోభయ భాషాకవితావిశారద శారదాచరణకమల పరిచరణపరిణత మానసాయ్యలార్యవిరచితం బయిన శ్రీమద్రామాయణంబునందు యుద్ధకాండశేషంబునందు సర్వంబును నేకాశ్వాసము"

ఆని. ఈతఁడు తాను "హుళిక్కిభాస్కరుఁడు చెప్పఁగా మిగిలియున్న యుద్ధకాండమును బూర్తిచేసితి: ననియును. యుద్ధ కాండాంతమునం దొకపద్యము గద్యస్థానీయముగాఁ జెప్పెను. దీనితోడనే