Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కవిజనాశ్రయము

వినుతవిశిష్టసమాజా!
యన నంత్యప్రాస మగు[1] నహర్పతితేజా ![2] 88

వ. మఱియుఁ బ్రాసాక్షరలక్షణవిశేషం బెట్టి దనిన ?[3] 89

క. వలసినచో లళములు డళ
   [4]ములు మఱి ఋక్రాంతవర్ణములు ప్రాసము లై
   యలవడు సత్కవికృతులన్
   నిలుపం దగు వానిఁ దెలిసి నియతప్రీతిన్. 90

క. తాళము దాలము నాఁ జనుఁ
   జోళుఁడు చోడుండు నాఁగ సొం పగుఁ గృతులస్
   వ్యాళము వ్యాలము వ్యాడము
   నోలిని సమరూఢిఁ బ్రాసయుక్తము లయ్యెన్. 91

గీ. భీక రాకారుఁ డయ్యు నభీకృతుండు
   మేదురక్రోధి యయ్యు ననాదృతుండు
   [5]పావనాత్మకుఁ [6]డయ్యు ఖలావృతుండు
   నాఁగఁ బ్రాసములకు సమానంబు లెపుడు. 92

  1. ద-ప్రాస మిది యహ.
  2. ఇంతవఱకుఁ బ్రాసములను గూర్చిన పద్యములు క-డ-ద-బ-లలో మాత్ర మున్నవి.
  3. ఈవచనమును దీనిపిదప వచ్చుపద్యములు మూఁడును క-డ-ద-లలో మాత్ర మున్నవి. ఈపద్యములు విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణియందుఁ గూడ గన్పట్టు చున్నవి. కావున నిందుఁ బ్రక్షిప్తము లైనవేమో యని సంశయింపఁదగి యున్నది.
  4. ద-ములు మఱియును నిట్టివర్ణములు.
  5. ద-పాదకా.
  6. ద-డయ్యనలా.