31
కవిజనాశ్రయము
గాని, కొన్నితావుల నించుకభేద మున్నది. సంస్కృతములో శిఖరిణీవృత్తమున కాఱక్షరములమీఁదను, బృథ్వీవృత్తమున కెనిమిదియక్షరములమీఁదను యతి. తెలుఁగులో వీనికిఁ బండ్రెండు, పదునొకండునక్షరములమీఁద యతి విధింపఁబడినది. ఇట్లే మఱికొన్నిస్థలములందును భేదమున్నది.
- ప్రాసము. -
యతివలెనే ప్రాసమును మొదటఁ బద్యాలంకారముగాఁ బ్రయోగింపఁబడిన ట్లగపడుచున్నది. కాని, యది యిప్పు డఱవ మందును, గన్నడమందును, దెలుఁగునందును గూడఁ బద్యలక్షణములలోఁ జేరియున్నది. అరవములో దీనికి “యదుఘై” యని పేరఁట. ప్రాసమునకు వ్యంజనము ప్రధానము గాని స్వరము కాదు. యతికివలె సవర్ణాక్షరము ప్రయోగింపరాదు. కావున యతికంటెఁ బ్రాసము కవులకుఁ గష్టతరము. మొత్తముమీఁద యతిప్రాసనియమాధిక్యముచేత నితరభాషలయందు కంటెఁ దెలుఁగునఁ బద్యములు చెప్పుట కష్టతర మనుటకు సందేహములేదు. ఈకారణముచే నీనియమముల రెంటిని గూడఁ ద్యజింపవలయు నని కొందఱ కభిలాషముకలదు. యతి ప్రాసలు పద్యాలంకారము లగుటయేకాక శబ్దస్వరూపము నిర్ణయించుట కత్యంతోపయోగకరములుగా నుండుటం బట్టియు, నేఁటిదనుక నాంధ్రవాఙ్మయాభివృద్ధి కీనియమములు బాధకములుగా నుండియుండక పోవుటం బట్టియు, నిప్పుడుగూడ నితర భాషలయందుకంటె నాంధ్రమందే కవితాప్రచార మధికముగా