ఈ పుట అచ్చుదిద్దబడ్డది
66
కవిజనాశ్రయము.
భ్రౌసంబు లిడక తత్పాదంబులం దెల్లఁ
బన్నుగా వ ళ్లట్లు [1]పరఁగ నిలిపి
దేసి తెనుంగులఁ[2] దియ్యనినొడువులఁ
దెల్లంబుగా నర్ధదృష్టి దెలుపు
ప్రాససీసము దీని పశ్చిమార్ధంబునఁ
బ్రాసంబు వేఱొక్క ప్రాసమైన
గీ. [3]శ్రీసమేతుఁ డైన జినపాద [4]పంకజా
వాసమధుకరుండు వాసవప్ర[5]
హాసభాసి[6] రేచఁ డనవద్యుఁ డక్కిలి[7]
ప్రాససీస మనుచుఁ[8] బరఁగఁ జెప్పె. 16
- వడిసీసము ; అక్కిలివడిసీసము. -
వివిధ చతుష్షష్టివిద్యల నజుఁ డని
వినుతనయోపాయవిమలబుద్ధి
నమరేంద్రగురుఁ డని యధిక తేజంబున
నాదిత్యుఁ డని సుందరాంగ యుక్తి
నంగజుఁ డని యీగి నంగాధిరా జని
యలవున నభిమన్యుఁ డని సమస్త
జనులు ముదంబున శ్రావకాభరణాంకు
సత్కవిఁ గవిజనాశ్రయు గుణాఢ్యుఁ