Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

65

వ. మఱి సమసీసంబు లన్నవి అవకలిసీసంబు, ప్రాససీసంబు, అక్కిలిప్రాససీసంబు, వడిసీసంబు, అక్కిలివడిసీసంబు నా నేనుదెఱంగు లయ్యె[1]. అందు, –

- అవకలిసీసము. -

   పాదంబు నాలుగుపాదముల్ గాఁ జేసి[2]
              మొదలిమూఁటికి లోకవిదిత మైన
   యలయాఱు[3]గణములు వెలయ (నిర్ )మూఁ డిడి
              మానుగాఁ దక్కినవానియందు
   నగణముల్ రెం డిడి తగఁ గూడఁ బాదముల్
              నాలుగు నిప్పాట నోలి నిలిపి
   సమసీసములు చెప్పుఁ డమరంగ రెంటికిఁ
             బ్రాసముల్ వేఱుగాఁ జేసి యొనర

గీ. సలలితముగ నిట్లు విలసత్పదంబుల
   రసికమైనరచన లెసఁగి యుండఁ
   గవిజనాశ్రయాంకుఁ డవకలిసీస మి
   ప్పాటఁ జెప్పఁ బనిచెఁ[4] దేటపడఁగ[5]. 15

- ప్రాససీసము ; అక్కిలిప్రాససీసము. -



   ప్రాసంబు నాలుగుపాదంబులందును
            బన్నుగా నిడి పెఱపాదములను

  1. ద-లో అంకిలి సీస మొక్కటి యధికముగాఁ బేర్కొనఁబడినది.
  2. ద-పాదంబులుగఁ జను.
  3. చ-డ-ద-నల నామ.
  4. ద-దొడఁగె.
  5. చ-ప్పాటఁ జెప్పెఁ గృతులఁ దేటపడఁగ.