Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

53

లయగ్రాహివృత్తము. -
     [1]ఇం బడరఁగా భజసనంబులకడన్ భజస
          నంబులు భ కారము నొడంబడి లయగ్రా
     హిం బరఁగఁ జెప్పు కలశం బిడినయట్ల యగ
          ణంబు కృతిమీఁద నమరుం బరహితార్థీ ! 127

లయవిభాతివృత్తము. -
     నసననసనంబులును నసననసగంబులును
          నెసఁగఁగృతి పాదముల రసికతను జెప్పన్,
     గుసుమశరవత్సుభగ! యసదృశగుణా! వినుత
          రస! లయవిభాతి యని రసమసుకవీంద్రుల్ . 128

త్రిభంగివృత్తము. -
     ననననలును ససభమలును సగయుక్తము లైనన్
          మృదు వైనన్ బ్రస్తుత మైనన్
     వనరుహభవనిభ ! మన మలరఁ ద్రిభంగిని జెప్పున్
          వడి దప్పున్ బ్రాసము లొప్పున్ . 129

[2]లయహారివృత్తము. -
     పదునొకఁడునగణములతుద సగణమును గురువుఁ
          గదిసి మృదుపదరచన నొదవి క్రియఁ బ్రాసా[3]
     స్పదనిరతి నునుపఁదగు నది సుకవివరులు పొగ
          డుదు రసమబహుకృతుల విదితలయహారిన్. 130

  1. డ-లో లేదు.
  2. డ-లయవిహారి.
  3. ద-వాచా.