ఈ పుట అచ్చుదిద్దబడ్డది
54
కవిజనాశ్రయము.
[1]దండకలక్షణము. -
అమరఁగ ననహంబులం[2]దాదిగా నొండె, కాదేని నాదిన్
దకారంబుగా నొండె, లోనన్ దకారంబు లిమ్మై గకారావ
సానంబుగాఁ జెప్పినన్, దండకం బండ్రు దీనిం గవీంద్రుల్ జగ
ద్గీతకీర్తీ ! పురారాతిమూర్తీ ! సదాచారవర్తీ ! సముద్యద్గుణార్థీ!
వణిగ్వంశచూడామణీ! బంధుచింతామణీ ! శిష్టరక్షామణీ!
సుందరీవశ్యవిద్యామణీ! రేచనా! కావ్యసంసూచనా[3]! 131
___________
- అర్ధసమవృత్తములు. -
[4]క. కమలాధీశుఁడు రేచన
కమలాసనక మలనాభకమలాప్రియవృ
త్తముల మహత్త్వము తేజ
స్సమేతుఁ డొనరించు నర్ధసమవృత్తములన్. 132
[5]క. ఆదిద్వితీయవిలస
త్పాదంబుల వేఱు వేఱుభంగుల నిడ న
ప్పాదములఁ బోలఁ దక్కిన
పాదము లర్ధసమవృత్తపద్ధతి యొప్పున్ . 133