చి;లక సముద్రం కలెక్టరు
11
అంతట ఆ మర్నాడు స్నాడ్ గ్రాసు నుంచి కొత్తసూటు దొరటోపీ వెసుకొని జోడుగుర్రాల బండి యెక్కి *[1] డైరెక్టర్ల కోర్టువారికి వందనా లర్పించడానికి వచ్చి 'అయ్యా ఇప్పుడు మీరు నా ఆదాయం సాలుకు 5 వేల పౌనులు అయ్యేటట్టు చేసినా' రని అన్నాడట! ఈ మాట వినేటప్పటికి వాళ్ళందరూ తెల్లపోయారు. ఈదృశ్యం సరిగా వర్ణించడానికి ఎవరితరము?
స్బాడ్ గ్రాస్ చిలకసరస్సు దగ్గర రుచి మరగిన సౌఖ్యాల నన్నింటినీ మళ్ళీ స్వేచ్చగా అనుభవించడానికి మళ్లీ అతనికి అవకాశం కలిగింది. అతడు మళ్లీ తలయెత్తాడు. ఇప్పటిలాగే ఆ రోజులలో షోకీళాలందరూ నివసించే మేఫెయిరులో చెస్టరుఫీల్దు వీధిలో ఒక దివ్యభవనాన్ని ఇతడు తీసుకున్నాడు. దానిని చక్కగా అలంకరించాడు. కొన్నాళ్లు అయ్యేటప్పటికి ఉద్యోగరీత్యా అతనికి తటస్థించిన లోటుపాటులు అందరూ మరిచిపోయారో, లేకపోతే ఇలాంటి లోపాలు అందరికీ వుంటాయని సరిపెట్టు కున్నారో, కాని అందరూ అతనిని మర్యాద చేసేవారు. ఇతడు తన కాలంలో ఇండియానుండి వచ్చిన ప్రముఖులైన వారిలో ఒకడైనా ఇలాగ అతడు నలుగురిలో గౌరవంగా వుంటూ 1824లో ఓరియంటల్ క్లబ్బు స్థాపించడానికి కారకులైనాడు. దానిలో ఇండియాలో గవర్నర్లుగానూ సేనానులు గానూ పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టను, విలియం బెంటింగు, సర్ జాన్ మాల్కలం సర్ తామస్ హిన్లస్, మొదలైనవారు ఇతనితోపాటు సభికులైనారు. ఇతడు మెరైన్ సొసైటీలో 15 సంవత్సరాలు సభికుడుగావుండినాడు. స్త్రీల ఆసుపత్రికి కూడా ఇతదు పోషకుడుగా వుండినాడు. ఇలాగ లండనులో పేరెన్నిక పొందిన వారిలో ఒకడుగా నుంటూ ఇతడు 1834 వ సంవత్సరం ఆగస్టు నెల 29 వ తేదీన దివంగతుడైనాడు.
- ↑ *ఈ కధ కొన్ని సంవత్సరాలక్రిందట పయెనీరు పత్రిక వ్రాసింది. బెయిలీ గారు కూడా మళ్ళీ వ్రాశారు. అతడు నాలుగు గుర్రాల బండిలో వెళ్ళాడని పాఠాంతరము.