12
కథలు - గాథలు
స్నాడ్ గ్రాసు చనిపొవడానికి మూడేండ్ల క్రిందట ఒక విల్లు వ్రాశాడు. ఇతడు రసెల్ అనే వితంతువుయొక్క పెళ్ళిగాని పెదకుమార్తెయైన ఎలిజాకు ఒకలక్ష 73 వేలపౌనులు చెందచేసినాడనిన్నీ, దీనికి కరణం ఆమె తండ్రి తనపట్ల దయగా వుండడమే ననిన్నీ జంటిల్మెన్సు మాగజీనులో ప్రకటించారు. కాని ఇది సరి కాదనిన్నీ, ఆవిల్లు తాను చూచినాననిన్నీ ఇండియాలో చిలకసరస్సుతీరంలొ గల తనకున్న ఇంటినీ, భూమినీ తన స్నేహితుడైనట్టిన్నీ ఖాండ్లింగు ఆసుపత్రిలో వున్నట్టిన్నీ గేబ్రేల్ గిల్బర్దుకు చెందచేసినాడనిన్నీ, తన స్నేహితులకూ, స్నేహితు రాండ్రకూ యీ క్రిందివిధంగా ఇలా మొత్తాలు చెంద చేసినాడనిన్నీ చార్లెస్ లాసన్ గారు మెమరీస్ ఆఫ్ మద్రాస్ (Memories of Madras) అని తాను రచించిన పుస్తకంలో వ్రాశారు, స్నాడ్ గ్రాసు వ్రాసిన మరణశాసనము ప్రకారము అతడు చెందచేసిన ఆస్తి చాలా వున్నది.
అప్పర్ గిల్డు స్ట్రీటు ఫౌండ్లింగ్ ఆస్పిటలులో నున్న గేబ్రిల్ గిల్బర్టుకు, రంబలో చిలక సరస్సుఒడ్దున వున్న ఇల్లు, భూమి (గడచిన 30 సం||లనుంచి ఖాళీగావుండి కంపెనీవారి తాలూకు 2500 పౌనుల బాండుక్రింద వుంటూవున్న ఆస్తిని ఇచ్చినారు.
4000 పౌన్లు ఎలిజారస్సెల్ ను, కిల్లెటను, హ్యుఎడ్వర్డ్సును, మేజర్ జాన్ స్మిత్తును ఎగ్జిక్యూటర్లుగా నియమించి వారికి చెరివక వేయిపౌనులు మొత్తం పౌ.4000-0-0 లు యిచ్చాడు.
1000-0-0 పౌనులు ఎలిజబెత్తుగిల్లెటుకూ, మిసెస్ కవర్లుకూ దానిపైని అయివేజు యివ్వగలందులకు.
1000-0-0 పౌనులు (సవరసులు) అనీ జెఫ్రీకి
1000-0-0 " " చార్లటీ హంప్ స్టెడ్ కు
400-0-0 " " తామస్ ఫ్లక్ కు
200-0-0 " " హెన్రీ బాసన్ కు
200-0-0 " : రెబెకా పాట్రిడ్జికీ