పుట:Kasiyatracharitr020670mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాహ్మణ గృహములేదు. నాడు 3 ఘంటలకు లేచి రాత్రి 2 ఘంటలకు కడప చేరినాను. దారిలో కొండలు, కనమలు దాటవలెను. దారి బహు రాతిగొట్టు; జలవసతి లేదు. కడపలో 4 దినము లుంటిని. ఆది మంచి పట్టణ మనబడి యున్నది. అన్నిపనివాండ్లు గలరు. జిల్లాకోరటున్ను కలకటరుకచ్చేరి గలవు. ఆయాయిలాకా మనద్దీలు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దగ్గిర నది యున్నది. ఊరి నడుమ నొక బుగ్గ యున్నది. ఇండ్లు సంకుచితములు. ఊరివద్ద నొక రెజిమెంటు ఉన్నది. అందులో ఆ యిలాకా దొరలు కాపుర మున్నారు. మరియొక పక్క సీవిలు దొరలు కాపుర మున్నారు.

7 తేదీ ఉదయాన 5 ఘంటలకు కడప విడిచి 9 ఘంటలకు పుష్పగిరి చేరినాను. దోవ సరాళము. కడపవద్ద నొక నది దాటవలెను. అది వాన కిరిసినప్పుడు అతివేగముగా ప్రఫహించి వెంటనే తీసి పోవుచున్నది. పుష్పగిరి పుణ్యక్షేత్రము పినాకినీనదీ తీరము. నదిగట్టున కొండ వెంబడిగా రమణియమైన యొక దేవస్థల మున్నది. అది హస్థినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్థ పీఠాధిపరి యయిన పుష్పగిరి స్వాములవారు అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. భ్రాంహ్మణ గృహములున్నవి. అక్కడి బ్ర్రంహణులు కొంత వేదాంతవిచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకున్ను పేటకు పోవలెగాని, అక్కడదొరకవు. నదిదాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నదిదాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది. ఆదినము 3 ఘంటలకు బయలుదేరి కొన్ని పినాకినీ నది కాలువలు దాటి 5 గడియల దూరమందున్న కాజీపేట చేరినాను. బాట నిండామంచిదికాదు. అది పేటస్థలము. వసితిగా నుండే యిండ్లు లేవు. అయినా బ్ర్రాంహ్మణులున్నారు. 8 తేది రాత్రి 3 ఘంటలకు లేచి 14 ఆమడలో నున్న దువ్వూరు 9 ఘంటలకు చేరినాను. దోవలో అడివిలేదు. బయలు పొలము లెస్సగా నున్నది. ఆ గ్రామములో వసితిగా నున్న యిండ్లు, చావిళ్ళు గలవు. చేరినట్టు పేటయున్నది. అక్కడ అన్ని వస్తు