పుట:Kasiyatracharitr020670mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వులు దొరుకును. అదివరకు కడపజిల్లాలో చేరినభూమి. ఆ యూరు 3 ఘంటలకు వదిలి 5 గడియల దూరమందున్న వంగలి గ్రామమును గడియ ప్రొద్దుగద్దనంగనే చేరినాను. అక్కడ గొప్ప యిండ్లు, చావిళ్ళున్నున్నవి. దగ్గిర పేటగలదు. అదికందనూరు వబావగారిది. రూపశింగనేసరదారుల్ని కొలువుకు గాను, ఈగ్రామము వగైరా కొన్ని యూళ్ళు జాగీరుగా నివ్వబడినవి. దువ్వూరు మొదలుకొని ప్రతి గ్రామమందున్న కొండ కరంకలవాండ్లు ఇనపరాళ్ళతో నినుము జేయుచున్నారు.

9 తేదీ వాననుంచి మధ్యాహ్మము వరకు నిలచి 12 ఘంటలకు బైలుదేరి దారి చూపను అచ్చటి వారిని తీసుకొని అరగడియ ప్రొద్దుకద్దనంగనే 14 ఆమడలో నున్న అహోబళ క్షేత్రమును చేరినాను. గోప సరాళము. అడుగడుగుకు గ్రామములున్నవి. ఒక చిన్న నదిన్ని, వాగుకాలువలున్ను దాటవలెను. అయితే అడివిభూమి. ఆక్షేత్రమందు యెగువ అహోబళము, దిగువ అహోబళమని రెండు స్థలములు ఒకదాని కొకటి 4 గడియల దూరమందున్నవి. నడమ చీకటిగల యడివి. యెగువ అహోబళానికి పైన కొండమీద ఉక్కుస్తంభమని చెప్పబడే స్తంభముగల పుణ్యక్షేత్రమున్నది. అక్కడి అడవి నడుమ కాలిబాట. ఒక సవారిన్నిపోదు. అది నరసింహ్వమూర్తి ఉద్బవించిన స్థలము. దిగువనను, యెగువనను నరసింహమూర్తి ప్రతిమ లనేక యవనరాలుగా చేసి బెట్టి ఆరాధింపుచున్నారు. ఈస్థలము కుంభకోణము వద్దనుండే అహోబళంజియ్యరువారి యొక్క అధీనము. వారి ముద్రకతన్ అహోబళానకు రెండు కోసుల దూరమందున్న బాచపల్లెలోనిండి ఆస్థల విచారణ జేయుచున్నాడు. ఆముద్రకతన్ యెగువ దిగువ స్థలములలో అర్చన చేసే అర్చకుల కిద్దరికిన్ని అప్పుడప్పుడు నెల 1 కి 6 రూపాయిలు జీతము యేర్ప రచుచు వచ్చుచున్నాడు. గుడి ఖర్చులకు జియ్యరు పంపింఛే అయివజు దప్ప మరియే అకరమున్ను లేదు. రాజా చందులాలా* యీస్థలానకు ప్రయాధన్ మైన సాలుకు రూపాయలు ఇప్పింపుచున్నాడు. యెగువ అహోబళానకు


  • రాజా చందులాలా హైదరాబాదు నివాస పేష్కారు.