పుట:Kasiyatracharitr020670mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుటలు

146  యిందులో బ్ర్రాంహ్మణులు శూద్రజాతిని మిక్కిలి తక్కువ పరచుట యితర మతము వృద్ధిబొందుటకు హేతువయిన దనిన్ని, పెద్దలు పామర జనులను కడతేర్చవలెనని బింబారాధనను విధీంచితే భగవంతుని హేయములైన వికారపు ఉపచారములను లోకులు చేయసాగినందుననున్ను బ్రాహ్మణులు మేము శ్రేష్టులమని ఇతరవర్ణాలను ధిక్కరించడము వల్లనున్ను వీరి దురాచారముల వల్లనున్ను వీరియేడల భగవంతునికి కటాక్షము తప్పి సత్యము మొదలయిన సుగుణ సంపత్తుగల యింగిలీషువారు హిందుదేశము యేలేటట్టు దేవుని కృపకు పాత్రులైనారనిన్ని చెప్పియున్నది.              165 - 178
     యిందులో గౌడులు సాత్విక దేశమందు వసించుటవల్ల సత్వగుణము గలిగి మత ద్వేషములు లేని అన్యోన్యముగా వున్నారనిన్ని డాక్షిణాత్యులైన ద్రావిళ్ళు మిక్కిలి కర్మ శ్రద్ధగలవారయి నందున వీరికి మతద్వేషములు హెచ్చయి అన్యోము లేక యున్నారనిన్ని గౌడద్రావిళ్ళవిభజన క్రమమున్ను కేరళస్థులు, చిత్సాననులు, కరాడీలు, గయావళీలు గంగాపుత్రులు శాకద్వీపబ్రాహ్మణులు విశ్వకర్మబ్రాహ్మణులు వీరి సంగతిన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జారి భేదములు యీశ్వర కల్పితములయితే సకల దేశములయందున్ను యీ జాతిభేదములు వుండవలసినిది; అలాగు లేక కర్మ భూమియందు మాత్రమే కలిగియుండుటవల్ల జాతిభేదములు మనుష్య కల్పితములనిన్ని స్మృతులయొక్క విభజన క్రమమును వ్రాసియున్నది.        190 - 202
  యిందులో గంగాదితీర్త ములనున్ను కాశి మొదలయిన పుణ్యక్షేత్రములనున్ను పౌరాణములగుండా సకల పాపనాశకములనిన్నీ, ముక్తిప్రదములనిన్ని యేర్పరచి నందుకు కారణమేమంటే పెద్దలు మంచి యోచనగలవారై ప్రపంచ వ్యాపారములలో ముణిగియుండే జనులకు తాముచేసిన పాపములు పుణ్యతీర్తములలో స్నానముచేస్తే నివర్తించుననే ధైర్య