పుట:Kasiyatracharitr020670mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

                                                                                                    పుటలు

నప్పుడు దండ్రి కరుణతోచినట్టయితే ఆ తల్లి శిక్షను తప్పించే లాగు యీశ్వరుడు కర్మానుభవములను తప్పించుననిన్ని, మరిన్ని తల్లి శిశువును సకలవిధాలా రక్షించి వాని మంచినడతలను చెప్పి వానియెడల తండ్రికి మిక్కిలి విశ్వాసము కలుగచేసే లాగున సత్కర్మము యీశ్వరకటాక్షములను విడవకూడదనిన్ని చెప్పబడియున్నది. ఇందులో శైవ వైష్ణవ మతములలో పెద్ద పామరులను కూడా తరింపచేయవలెనని వారి నడతలకు అనుకూలముగా మీరు సారాయి తాగినా యీశ్వరార్పితము చేసితాగండని శాక్తరామానుజ కూట పూజలను కలగజేసినట్టు ఆత్మహత్య చేయవలనన్నవారికి యీశ్వరార్పితముగా త్రివేణిలో దేహత్యాగము విధింపబడినదని చెప్పియున్నది.

     ఇందులో స్వామియెడల భృత్యుని న్యాయముగా నటించుట ఇహపరసాధకమని చెప్పియున్నది.
     ఇందులో జ్ఞానమే మోక్షమునకు ముఖ్యసాధనమయినా కర్మద్వారా సాధింపబడిన జ్ఞానమే నిర్విఘ్నముగా మోక్షమును పొందించుగాని శుద్ధజ్ఞానము బలముకలదిగాదని సదృష్టాంతముగా చెప్పియున్నది.
     ఇందులో సౌరశాక్తాది మతాలు అద్వైత విశిష్టాద్వైతద్వైత మతములలో చేరినవనిన్ని దీపదీపికాన్యాయముగా జగదీశ్వరులకు భేదములేదనుట అద్వైతననిన్ని, పాలతో కలిసి యున్న నెయ్యివలె కించిత్తు భేదము కలది విశిష్టాద్వైతమనిన్ని పాలుపెరుగు మజ్జిగలవలె భేదము కలదనుట ద్వైతమనిన్ని, క్రీస్తుమహమ్మదు మతస్వరూపమున్ని స్త్రీలకు అధోభాగందున్న హృదయగ్రంధి వీడి ఊర్థ్య భాహగమందున్న హృదయద్గ్రంధి వీడనందున మోక్షహేతువైన జ్ఞానము పుట్టనందున వారికి మోక్షములేదనిన్ని యితర జంతువులవలె స్త్రీలు పురుషులకు భోగార్హత లేననిన్ని చెప్పబడియున్నది.