పుట:Kasiyatracharitr020670mbp.pdf/340

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వొకమాత్రముగా యెవరినిన్ని అనుకోనివ్వరు గనుకనున్ను మీది మిక్కిలి హిందువులు పై సంకరద్వారా మత విషయమై బహిరంగకృత్యములలో గర్హితముగా కొన్నికొన్ని ప్రమేయాలయందు నడుచుచున్నారు. గనుక పయిన నార, లోపల చెక్క, అందులోపల మధురమయిన విత్తు, కలిగిన బాదమపండు వతుగా వుండే హిందూమత సారమును తెలుసుకోలేక హిందువులు తెలియక మణిగిపోతారే; మనమతము పట్టితే కడతేరుదురే; అనే పశ్చాత్తాపముతో స్వమత ప్రకటన చేయను యిగిలీషువారు వుద్యోగిస్తూవున్నారు గాని మరి యెటువంటి విషయములోనున్ను హిందువులకు యే విరోధముచేతనైనా తమచేతనయిన మట్టుకు తొందరలేకుండా రాజ్యపరిపాలన చేయుచు ఈశ్వర కటాక్షమునకు దినదినానికి పాత్రులుగా ప్రవర్తింపుచువున్నారు.

యీ కటకపు షహరులో 2000 యిండ్లు కద్దు. పదివేలమంది ప్రజలు వుండవచ్చును. సమస్తమయిన పదార్ధములు దొరుకుచున్నవి. తురకలు ఈ రాజ్యము చేసేటప్పుడు యిక్కడ తురకలు నిండా ప్రవేశించినారు. ఇప్పట్లో మొహరంపండుగ అయినందున యీవూళ్ళో తత్ప్రయుక్తమయిన వుత్సవము జరుగుచున్నది. గాని దక్షిణదేశమువలెనే వుత్సవము జరిగింఛేవారు నామము బొగ్గు మొదలయినది పూసుకొని వెఱ్ఱిచెష్టలు విస్తారము చెయ్యడములేదు.

మహమ్మదు మతస్థులు కాబూలుదేశ ద్వారా హిందుస్తానులో ప్రవేశించిన వెంబడిగానే సింధునదీ తీరమందు వున్న సోమనాధస్వామి గుడి నవరత్నఖచితమైనది వుండగా కొట్టి పాడుచేసి కోట్యంతరాల రత్నాలు స్వాధీన్ముచేసుకొని అక్కడి నివాసులనున్ను పంజాజ అనే అయిదు దారలు కల సింధు నదీ తీరమందు వుండే హిందువులనున్ను సుమారు లక్షమందిదాకా మహమ్మదుమతములో మేము ప్రవేశించమని చెప్పినందుకు వారిని శిరచ్చేదము చేయించినారు. అటుతర్వార ప్రయాగలోవున్న అక్షయవటం యంత్రము మొదలయిన స్థలములను నిర్మూలముచేశినారు. కాశిలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణ వగైరా దెవతలను వారి మందిరాలను బ్రహ్మాలయాలను పగలగొట్టినారు. యింత నిర్బంధము మహమ్మదు మతస్థులు జరిగించినప్పడికీన్ని