పుట:Kasiyatracharitr020670mbp.pdf/339

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజ్య పరిపాలనచేయ నేర్చిన సంప్రదాయకులు యీ కర్మభూమిని లేకపోయిరి. కడమ మూడువర్ణములవారు యెంతవారివారి ధర్మములు జరిపింపుచున్నా శిక్షకులు రక్షకులున్ను అయిన క్షత్రియులు లేకపోయి నందున వీరి స్వధర్మములు ధీర్ఘముగా జరిపించు కోలేక వర్ణాశ్రమ సంకరులైనారు.

శాంతిరహితులయిన బ్రాహ్మణులద్వారా యింత సంకరము అయిన వేడుక యీశ్వరుడు చూచి వీరి శిక్షనిమిత్తము బలాత్కారము చేత కర్మశూన్యులని చేయ నేర్పరచిన తామసగుణ ప్రధానులయిన మహమ్మదంత ప్రవిష్ణులను యీ భూమిలో ప్రవేశింపబెట్టి కావలసి నంతమట్టుకు పూర్వపు వాసనప్రకారము కర్మద్వారా జ్ఞానము సంపాదించనలె నని పొరాడుతూ వుండే బ్రాహ్మలను శిక్షించినాడు. పూర్వీకులు చేసిన పాపానికి వారివంశస్థులు యెట్లా శిక్షకు అర్హులయినారని విచారిస్తే "మాతాశేశద్ మక్కళ్ క్కొ" అనే అన్యయారువచనమే ఆకరము. పిమ్మట యెశ్వరుడు కృపాసముద్రుడు గనుక అనుపూర్వికమైన కర్మభూమి శుద్దముగా కర్మశూన్యమైపోవుననే భయముచేత సత్వగుణప్రధానులై బుద్ధికుశలతచేత యీశ్వర సృష్టి అయిన అనేక బ్రహ్మాండముల గతులను ఉత్తర దక్షిణ ధృవనక్షత్రాల స్థితులనున్ను తెలిపి సాహస ధైర్యములతొ నక్షత్రరూపముగా నుండే బ్రహ్మాండాల వుచ్చములను పట్టి సముద్రము మధ్యేవాడలను నడిపించి యిన్ని బ్రహ్మాండములకు సృష్టికర్తగా వొకడేవున్నాడని నమ్మి యీశ్వరుణ్ని ఆరాధనచేయుచూ వుండే యింగిలీషువారికి తగుపాటి బహుమతిగా ఈ కర్మభూమిని అవలీలగా యిచ్చినాడని తోచినది.

యీశ్వరుడు చిద్విలసార్ధమై ప్రతి చైతన్యానికి భిన్నరూపము భిన్నధ్వని భిన్నతత్పర్యము కలుగచేసి వున్నాడు గనుకనున్ను ప్రకృతి దేహములకు సద్గురుకటాక్షము కలిగేవరమున్ను ఆత్మస్తుతి పరనింద చేసేటంతగా మిక్కిలి ఆనందము వేరే లేదు గనుకనున్ను సాత్విక బుద్ధిగా విచారించితే హిందువులను తమ క్రీస్తుమతానకు యెక్కువ అని వారు అనుకోక పొయినా సరిపోలిన దనియైన అనుకో వచ్చును. దురత్యయమయిన యీశ్వరమాయ అటు సాత్వీకముతో