పుట:Kasiyatracharitr020670mbp.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగ్యమయిన ప్రకృతులు సృష్టికి అదిన్ని యిన్ని అని సంఖ్య నిర్ణయింపబడి వుండవలనని తోచబడుచున్నది. యింతే కాకుండా మహమ్మదు యింగిలీషు శాస్త్రాల ప్రకారమున్ను మనశాస్త్రముల ప్రకారమున్ను యీ ప్రకృతులకంతా వొక్క కాలములొనే వుపసంహార మనిన్ని తోచబడుచున్నది. ఆకాలమును జాతులవాండ్లు డే ఆఫ్ జడ్జిమెంటు అంటారు. మనవారు బ్రహ్మణాసహముక్తి అంటారు. మహమ్మదు మతస్థులు కయామల్ కాదిర్ అని చెప్పుచున్నారు. సృష్టియొక్క విభజన తెలిసే నిమిత్తము పైన వ్రాసిన వివరములవల్ల పరమాత్మవ్యాప్తి కొన్నిటియందు లేకుండా వుండునేమో అని సందేహించ వలసినది లేదు. పరాత్పర మయిన ఆకాశమహాభూతమనే పరమాత్మ సరాంతర్యామిగానున్ను, అణువులో అణువుగానున్ను మహత్తులో మహత్తుగా నున్ను ప్రత్య్హక్షపరోక్షాలుగా వుండే వున్నాడు. సృష్టియొక్క విభజన తెలియడానకు పయిఖుల్ల స్సు వ్రాసినాను. పంచమహాభూతములే దీపదీపికా న్యాయముగా పరమత్మ సంబంధములే గనుక సర్వంబ్రహ్మమయం జగర్ అనేవచనము సత్యముగా నమ్మడానకు యేమిన్ని సందేహము లేదు.

ఆకాశవాయు వహ్నిభూతాలు సృష్టించిన జంతుకోటికి బాల్యయౌవన కౌమార వార్దక దశలు సంభవించడానకు కారణమేమనిన్ని ఆ నాలుగు దశల సంచారకాలాలలో ఆ దేహములలోని అంతరాత్ములు దశాభేదరల్హితులైనా వారి దేహ చేష్టలద్వారా వారికే దశాభేదములు కలిగినట్టు అగుపడవలసిన దేహ చేష్టలద్వారా వారికే దశాబేదములు కలిగినట్టు అగుపడవలసిన దేమనిన్ని విచారించగా సృష్టియొక్క్జ వృద్ధి నిమిత్తము స్థూల దేహములలో పాంచభౌతికాలుగా వుండే ప్రకృతులనే బీజాలను యీశ్వరుడు ప్రవేశపెట్టి వాటి ధారణకున్ను పొషణకున్ను, అంకురోత్పత్తి చేయనున్ను మాయాశక్తి చైతన్య స్వరూపులయిన స్త్రీల యొక్క గర్భాలను కలగచేసి పురుష దేహసంగమ ద్వారా ఆ గర్భాలలో బీజాలను కలగచేసి, ఆబీజము తగుపాటి అంకురము కాగనే మాయాశక్తి చైతన్యము పూర్తిగా కలిగి పృధ్వీభూతము మీద ప్రత్యక్షముగా యీశ్వరుడు నిలుపుతాడు. అని మొదలుగా ఆ అంకురాన్ని పృధ్వీ మహా