పుట:Kasiyatracharitr020670mbp.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూతము వృద్ధిచేసి దాని సన్యకాలము వచ్చేవరకు పోషింపుచూ వుంచున్నది. సమస్త విధములయిన దేహములను ధరించి పొషించే శక్తి పృధ్వీ మహాభూరముదేకాని యితర మహా భూతములది కాదు. అందుకు దృష్టాంత మేమంటే మనుష్యులేమి, మృగాదులేమి, పక్షులేమి అన్ని జాతులున్ను వాటి పిల్లలను, గుడ్లను భూమి ధరింఛేపాటి పక్వమయ్యే వరకు మనుష్యులు విత్తనములు భూమిలో చల్లేటందుకు ముందర కొంతసేపు కుండలో నానవేసి వుంచి నట్తు కొంతకాలము జంతువులు బీజములను వాటి స్త్రీజాతి గర్భాలలో వుంచుకుని అవి భూధారణకు పక్వములు కాగానే యీశ్వరాజ్ఞ చొప్పున భూమిమీద ఆయా స్త్రీ జంతువులు వుంచుచున్నవి. అది మొదలుగా పృధివీ భూతము వాటినన్నిటిని యింకా తన మీద వుంచబడే యితర బీజములనున్ను అంకురాలం ఛేసి తర్వాత ఆ వృక్షాదులను, సస్యాదులనున్ను బెంచి మనుష్యులకు, జంతువులున్ను అనుభవించేటట్తుగా యీశ్వరాజ్ఞ చేత కాపాడుతూ వస్తున్నది. యీప్రకారము వుత్పత్తి అయిన దేహములు పెరిగి పుష్టిని పొందక బీజప్రదానము చేయలేక వుండేకాలము బాల్యదశగానున్ను, పెరిగి పుష్టిని పొంది బీజప్రదానము చేయ నిచ్చయించే కాలము యౌనదశగా నున్ను తర్వాత బేజొత్పత్తి చేయగలకాలము కౌమారదశగానున్ను, తదనంతరము విరామకాలము వార్ధకదశగానున్ను ప్రత్యేకముగా అనుభ్వించడానకు హేతు లైనవి. కాష్టములో అగ్ని ప్రవేశించినట్టు ఆత్మాంతరాత్మలు దేహాలలోప్రవేశించి వుంటారు గనుక కాష్టము వంగితే ప్రవేశించిన అగ్నిన్ని వంగినట్టు ఆత్మాంతరాత్మలు దేహసంబంధ మైన దశలను దేహాలు అనుభవించేటప్పుడు తామున్ను అనుభవించేవారివలె అగుపడుతారుగాని, ఆనాలుగు దశానుభవాలు ఆత్మాంతరాత్మలకు యెంతమాత్రమున్ను వాస్తవముగా లేవని తెలియబడుచున్నది.

దేహులయొక్క దేహాలలో సత్వరజస్తమోగుణములు మూడున్ను భిన్నములై వుండవలసినదేమనిన్ని, వాటి ప్రవృత్తి నివృ