పుట:Kasiyatracharitr020670mbp.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కలిగి కుదురుగా ఒక స్థలములోనే వుండుకొని సద్వ్యాపారముతో కాలము తోయవలెనని తలిస్తే అలాటివారు కన్నతావులలొనున్ను తిరగసాగితే పుట్టిన నిశ్చయము భేదించి పోవును గనుక అందుకు యోగ్యమయిన స్థలమును ఒకదాని యేర్పరచి అక్కడ చేయవలసిన కృత్యముల నున్ను యేర్పరచి తద్ద్వారా మోక్షము క్రమక్రముగా కలుగు నని బోధచేస్తే మనుష్యుల బుద్ధికి చాలా స్వస్థ్వము కలుగును గనుక యీ కాశీమహాత్మ్యము అలాటి వారికి వుపయోగింఛే లాగు యేర్పరచినా రని తోచుచున్నది.

గయా మహాత్మ్యమును గురించి యోచిస్తే లోకమందు తల్లి దండ్రులు మొదలయిన రక్త సంబంధికుల మీద అత్యంతమయిన ప్రీతి కలిగియుండవలసినది గనుకనున్ను, జరామరణాదులు యెప్పుడు సంభవింఛెదిన్ని యెవ్వరికిన్ని తెలియరాదు గనుకనున్ను అట్టి రక్త సంబంధికులు దేహము చాలించినంతలో వారు బ్రతికి వుండగా చేయవలసిన సత్కారములు చేయ డానకు వల్లపడక పొయివుండినా, చేసినది చాలదని తోచినా, వారి ఋణము మనమీద నిలిచిపోయెనే అనే పశ్చాత్తాపము కలవారికి అటువంటి రక్త సంబంధికుల మరణానంతరము వారిని తరింప చేసే వుపాయము ఒకటి వున్నదని తెలిస్తే ఆ పనిచేసి మన ఋణము తీర్చుకుంటిమి గదా అని మనస్సుకు ఆనందము పుట్టించవలసినది అగత్యము గనుక యీ గయా మహాత్మ్యము అటువంటి వారి విషయ మయి ప్రకటనము చేసినారని తోచబడుచున్నది.

సకల స్వరూపుడుగా నున్ను సర్వాంతర్యామిగా నున్ను వుండే దేవుడు వొక్కడే గనుక యే రూపము మీదనయినా భక్తి జనియించి దృఢమయిన బుద్ధితో యెటువంటి ఆరాధనను చేసినా సంతుష్టిపడి 'యేక మేవ ' యనే శృతి ప్రతిపాదితు డయిన 'అద్వితీయ బ్రహ్మా' అంగీకరించు నని తలచి మానుష సామాన్యబుద్ధికి ప్రీతివిశ్వాసములు జనియించతగిన రూపములు కల్పించి ఆ రూపముగానైనా పరమాత్ముడి ఆరాధనలను మనచేత చేయించ తలచి పూర్వికులు యిట్టి స్థలమాహాత్మ్యాలను ప్రకటన చేసినా రని తోచబడుచున్నది.