పుట:Kasiyatracharitr020670mbp.pdf/232

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆచార వ్యవహారములను గురించి తాత్పర్య భేదము కలవారము ప్రవర్తింపుచు వుంటారు. వీరిని ఆరాధన చెయ్యడములో ఉపాయము తెలిసి కొంత గుంపులకు ముందుగా కొంతగుంపుకు వెనక కొంత గుంపుకు సమకాలములో ప్రత్యేక స్థలాలలోనున్ను యీ ప్రకారముగా సభాపూజలు ఛేయుచు రావాలసినది. సుమంగలీపూజకు వేయి మంది స్త్రీలు వత్తురు. భిక్షము పెట్టేవారు కలిగితే రెండువేలమంది అనాధ స్త్రీలు జమ అవుతున్నారు. యిందరికిన్ని అన్నపూర్ణ కటాక్షముచేత పుష్కళమయిన అన్నము దొరుకుచున్నది. పిలువకనే వచ్చే పరదేశులలో స్త్రీలు పురుషులుగా 2000 మంది పంచ ద్రావిళ్ళలో వున్నారు. వీరి కందరికి అన్నపూర్ణ సత్రములో పూనా శ్రీమంతుని తమ్ముడైన అమృతరాయడు 2400 మందికి ప్రతిదినమున్ను అన్నము పెట్టుతాడు *మన దక్షిణదేశస్థులు బహుమంది కాశీ తంబురాయడనే పండారముగుండా 1000 కి అన్నము ప్రతిదినము కలగచేసియున్నారు. మయిసూరు రాజు మొదలయిన గొప్పవారు యింకా అనేకులు అన్నముగానున్ను శీదా (స్యయంపాకము) లుగానున్ను ప్రతి దినమున్ను యిచ్చుచున్నారు. విశ్వేశ్వరుడు యిక్కడ చనిపొయ్యే వారికి తారకనామ ఉపదేశము చేస్తానని ఆచొప్పున అన్నపూర్ణయిక్కడ వసించే వారికి అన్నము సమృద్ధిగా కలగచేస్తాననిన్ని ప్రతిజ్ఞ చేసినట్టు పురాణ మందు చెప్పియున్నది. అన్నపూర్ణ ప్రతిజ్ఞ ప్రత్యక్షముగా వున్నది.

శ్రీరాములుయొక్క అవతారానికి పూర్వమే అనాదిగా రామనామము తారకమయి యున్నది. అది తెలిసి శ్రీరాములకు ఆనామము తోనే వసిష్ఠులు నామకరణము చేసినారు. ఈహేతువుచేత యీ పట్టణములో యెవరు చనిపోయినా శ్మశానానికి శవానికి శవానుగమనము చేశే వారు 'రామ నామసత్తుహే' అంటు నడుస్తారు. తద్ద్వారా తద్వ్యతిక్తమయిన దంతా అనృతమని అర్ధమవుతూ వున్నది. యీ మహా స్థళానికి శ్రీమంతులు అనేకులు వచ్చి లక్షల మోడి సెలవు చేసినారు. స్థళమహాత్మ్యమేమో కాని, యే బహనా (నెపము)చేతనయినా నెలకు


  • పీష్వా అమృత రాయని దానదర్మములను గూర్చి బిషప్ హెబరు చక్కగా వర్ణించి యున్నాడు. ఈ అమృతరాయడు 1824 లోనే దివంగతుడైనాడు.