పుట:Kasiyatracharitr020670mbp.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన పూర్వీకులు దోవచూపితే, సారాయి పీపాయిలను ఖాలీచేయ సాగినారు. గొ బ్రాహ్మణుల పోషణ ప్రకటనమయ్యే కొరకై వారి పోషణ విషయమై అబద్ధమయినా ఆడవచ్చునని పూర్వీకులు వారికి పక్షముగా వ్రాస్తే, అపద్దముతోనే జీవనము ఛేయసాగిరి. వృద్ధ మాతాపితృపోషణ ముఖ్యమని తెలియపరచను 'అస్యకార్యశతం కృత్వా' అని మనువువ్రాస్తే పరద్రవ్యమును పేలపిండి వలెనే భుజింపసాగిరి. యీ రీతిగా పూర్వీకులు కడతేరేటందుకు వేశిన మొలకలను విషధారలతో పెంచినందుచేత విషజ్వాలా సహితము లయిన ఫలములే ఫలించినవి.

కలిలో భావిఫలములను పూర్వీకులు ఊహించినట్టు ఈకర్మతులు బహు మంచిది బహుమంచిది అనిచేసే పనులంతా యీశ్వరదృష్టికి అపరాధములుగా తోచి ఈ విపరీతము లయిన ఆచారములనున్ను అర్చనలనున్ను బ్నొత్తిగా నిలపదలచి యిప్పుడు ఈ బ్రహ్మాండములో యధోచితముగా పదవాక్య ప్రమాణ్యముగల యింగిలీషువారిని యీ కర్మభూమిని యేలేటట్టు చేసినాడు. యీ ఇంగిలీషువారికి అనుగుణము వుండడము మాత్రమే కాకుండా భూతదయ పశ్చాత్తాపము తారతమ్య జ్ఞానము శుచిరుచి సాత్విక గుణము ఉపశాంతి ఈశ్వరభక్తి యిది మొదలయిన సుగుణాలు శావావున్నట్టు తోస్తున్నది. తద్ధ్వారా వారు సర్వాంతర్యామి కటాక్షానికి పాత్రులయి సర్వోత్తమ మయిన యీ కర్మ భూమికి సార్వభౌములయినారని తోచు చున్నది.*

యీ కాశీపట్టణ మందువుండే సమస్త బ్రాహ్మణులు స్తోమాలని తడలనిపేళ్ళు వహించి ప్రత్య్హేకము ప్రత్యేకు లయిన గుంపులుగా నొక్కొక్క గుంపుకు ఒక అధిపతిని యేర్పరచుకొని యిది జాలంభొట్లస్తోమ మనిన్ని, యిది రాజేంద్రబాబు తడయనిన్ని యిట్లా చెప్పబడుచు కొంతకాలము ఒక గుంవు మరియొక గుంపుతో విహితముగానున్ను మరికొంతకాలము ద్వేషరీతిగానున్ను విద్వత్ గ్రామము గనుక


  • వీరాస్వామయ్యగారి కాలంలో ఈ దేశంలో ఉద్యోగాలుచేసిన దొరలలో సర్ తామస్ మన్రో, విలియం బెంటింకు గార్ల వంటి సత్పురుషులు, స్నేహపాత్రులు చాలామంది వుండేవారు. అందువల్లనే ఆంగ్లేయులయందు వీరి కంత అభిప్రాయం కలిగింది.