పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడినానన్న సందర్భము వారెరిగిన్నీ నాకు మళ్లా ఈ వస్తువును పట్టించారన్న విషయము ప్రస్తుతము. ఒకటి మాత్రం వున్నది. నేను దాని మత్తును లేశము కూడా భరింపలేకపోయినా, ఆ మత్తు పూర్తిగా దిగిన తరువాత, అనగా భంగు పుచ్చుకొన్న ఇరవై నాలుగు గంటల పిమ్మట, ఏపురాణం చదవడానికో మొదలు పెడితే బాగా వుంటుందని, ఆ ఘట్టంలో విద్యారులే కాకుండా, పండితులైన శ్రీ శోభనాద్రి శాస్రులుగారు కూడా అనేవారు. ఈ శోభనాద్రి శాస్తులుగారు మన దేశస్టులు. కాకరపర్తి దగ్గర అజ్జరం గ్రామం వీరి కాపురస్థలము. వీరి సోదరులందఱూ కాశీలోనే తర్కం చదివి పండితులై పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఈయన మహారాష్ట్ర కన్యకనే వివాహం చేసికొని కాశీలోనే కాపురమున్నారు. ఈయనకు నేనంటే చాలా అభిమానం. బలవంతపెట్టి నాకు సిద్ధానచంద్రోదయం అను వ్యాఖ్యానముతో తర్క సంగ్రహమును" ఈ మహానుభావుడే వుపదేశించిన పుణ్యాత్ముడు. నాకు కొంచెం ధర్మ ధర్మి భావం తెలియడానికేమి, ఎక్కడేనా వ్యాకరణంలో ఆర్థికం వస్తే ఇటీవల అది సులభంగా బోధపడడానికేమి, నాకు ఈయన చెప్పిన ముక్కలే కారణం.

మత్సద్మనిస్థియతాం

కాలార్థకంనాడు భంగు ప్రసంగంలోనుంచి ఇంతదాకా వచ్చాము. కాలార్ధకం చేసికోవడముకు పూర్వమే కాళికాష్టకములోనైనవి ఆయా దేవతలను దర్శించునపుడు రచించాను. పైకి ఆ కవిత్వం డాబుగా వున్నప్పటికీ, అందులో అర్థగాంభీర్యం మిక్కిలి తక్కువ