పుట:Kashi-Majili-Kathalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

కాదంబరి

భగవతీ! నిన్నుఁజూచినది మొదలు నాకును హృదయమున నెద్దియో యపూర్వమగు నుత్సాహము గలుగుచున్నది. నిశ్శంకముగాఁ గర్తవ్యములకు నన్ను నియోగింపుము. అన్యునిగా భావింపకు మని పలికి యతండు హేమకూటమునకు వచ్చుట కంగీకరించెను.

మహాశ్వేతయుఁ జంద్రాపీడునితోఁగూడ శుభముహూర్తంబునఁ బయలుదేరి క్రమంబున హేమకూట రాజధానికిం జని గంధర్వ రాజకులము నతిక్రమించి కాంచనతోరణ విరాజమానములగు కక్ష్యాంతరముల నేడిటఁ దాటి కాదంబరీ కన్యకాంతఃపుర ద్వారదేశమును జేరెను.

అందు మహాశ్వేతం జూచినతోడనే తొందరగా దూరమునుండియే ప్రతీహారిజనము వేత్రలతాయుక్తములగు హస్తములతో మ్రొక్కుచు మార్గమెఱిగింప నసంఖ్యేయ కన్యకా సహస్రములచే నిండియున్న లోపలఁబ్రవేశించి యంగనాద్వీపమువలె మెఱయుచున్నయం దద్భుతలావణ్య పూర్ణవిగ్రహులై దివ్యాలంకార శోభితలై యిటునటు తిరుగుచున్న గంధర్వస్త్రీలం గాంచి రాజపుత్రుండది స్వప్నమోయని భ్రాంతిజెంది యామెవెంట నడుచుచుండెను.

అందున్న గంధర్వ కన్యకా జనమునకు సఖిసస్తావలంబనములే పాణిగ్రహణ మహోత్సవములు, వేణువాద్యములయందే చుంబన వ్యతికరములు వీణలయందే కరరుహవ్యాపారములు కందుకక్రీడల యందే కరతలప్రహారములు భవనలతానేక కలశకంఠములయందే భుజలతా పరిష్వంగములు లీలాడోలికయందే జఘన స్తన ప్రేంఖితములు అశోకతరుతాడనముల యందే చరణాభిఘాతములు కాని సురతవిలాసములేమియు నెఱుంగరు. తత్తత్క్రయలచే శృంగారచేష్టల నభ్యసించుచున్నట్లు కనంబడుచుండిరి.

అట్టి వినోదములం జూచుచుఁ జంద్రాపీడుఁడు మహాశ్వేత