పుట:Kashi-Majili-Kathalu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

117


నా విషయమై యిన్నిచిక్కులు పడనేమిటికో విచారింపుము. ఆయువతి లజ్జావతి యైనచో బరిజనమున కంతఁ వ్యామోహమేల? ఆలలనకు మదలేఖ రెండవ హృదయముకదా! తన్ముఖంబున నయినఁ దెలుప రాదా.

అన్నన్నా! నిష్కారణము అమ్మదవతి మదనునిచేఁ బ్రాణసంకటము నొందుచున్నదే! ఇది యాముదితకుఁ బ్రారబ్ధముగాఁ దలంచెదను. కానిచో నేనశ్వముఖానుసారముగా దేవభూమి కెట్లుపోవుదును? పోయియు మహాశ్వేత నెట్లు కాంతును? కనియు మరలక హేమకూటమేటికిఁ బోవుదును? పోయియుఁ గాదంబరి జూడనేల? చూచియు వితర్కింపక వ్యధ౯మనోరధుండనై యింత దూర మేల వత్తును? ఇదియంతయు దైవహతకుని కపటముకాని మఱియొకటి కాదు. కావున వేగమ పోయి యాయింతి నోదార్చుటకు యత్నింప వలయునని పలుకుచుండగా మార్తాండుం డపరగిరిశిఖర మధిష్టించి కిరణ సహస్రముపసంహరించుకొనియెను.

అప్పుడు చంద్రాపీడుఁడు గేయూరకునితోఁగూడ దనమేడకుఁబోయి కాల్యకరణీయములం దీర్చి చంద్రోదయ సమయంబునఁ జంద్రమణి శిలాతలంబున శయనించి కేయూరకుఁడడుగు లొత్తుచుండ నతనితోఁ గేయూరకా! మనము పోవువరకుఁ గాదంబరి ప్రాణంబుల దాల్చియుండునా? మదలేఖ యామెనోదార్చుచుండదు? మహాశ్వేత తద్వృత్తాంతమువిని వచ్చి ధైర్యము గరపకుండునా? హరిణ శోబకాయతేక్షణమగు నమ్మగువ నెమ్మోము గ్రమ్మరఁజూడఁగలుగునా? యని యడుగ నతండు దేవా! ధైర్యమవలంబింపుము వెరవకుము వేగమ గమనయత్నము చేయుమని బలికెను.

అప్పు డతం డాత్మగతంబున అయ్యో! ఇప్పుడు మాతల్లి దండ్రుల కెఱింగింపక పోయితినేని వారు పుత్రశోకంబునం గుందుచు