పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రతినూపురకథ.

75

లిరువురు అమ్మా! నీ యుపన్యాస మింతటితో విరమింపుము. సీ! సీ! వేశ్యావృత్తి యెంతగర్హితము. ఈధనంబంతయు నీవిట్లేసంపాదించితివి గాఁబోలును. అయ్యయ్యో! మేమిట్టి కులంబున బుట్టితిమేమి?

చ. ఖలుఁడును జాతిశూన్యుడు వికారిగురుక్షయరోగి కుష్టుదు
    ర్లలితుఁడు కుంటి గ్రుడ్డి చపల కియుడున్ మలినాంగుఁ డెవ్వడే
    గలియగవత్తు విత్తమిదెకైకొనుఁ డన్న ముదంబుజెంది వే
    శ్యలు తమదేహమమ్ముదు రహా! యతినీచమికేది జూడఁగన్?

గీ. లలిత మణి భూషణాంబరాదుల ధరించి
   నెరయఁబైవన్నె లెన్నేని నెరపితుచ్ఛ
   విటులు బెక్కండ్రు భోగించి విడిచినట్టి
   గణిక యుచ్చిష్ఠపాత్రంబుగాదె? తల్లీ !

ఉ. మేడలుగల్గనీ! పశుసమృద్ధి లభింపగనీ! సిరుల్ గడున్"
     గూడగనీ! ప్రసిద్ధిపడగోటికిఁ దాపడగెత్తనీ! నిజం
     బాడెదమోశుభాంగి! వినుమా! గణికాజనజీవనంబు సీ
     పాడుసుమీ! కిమిక్షుధలపాలుసుమీ! తుదిఁదత్ప్రతీకముల్ .

గీ. కాపురంబులెన్నో మాపినిందలమోపి
   బొంకులాడి ధర్మములనువీడి
   కపటవృత్తి విటులఁగలసి జోగులఁజేయు
   పడపుబోంట్లు యమునిభటులుగారె?

ఉ. దేహమశాశ్వతంబనుచుఁ దెల్లముగాఁగ నెఱింగిరేని యీ
    మోహమదేల గల్గు నిహమున్ బరమున్ దలపోసినన్ వరా
    రోహకు భర్తయుండఁదగు రూఢిగనొక్కని మంచివాని స
    ద్రోహమనీష నెన్నుకొని తుష్టి వహింతుము మేము తల్లీరో!

అనిపలికిన విని రతినూపుర కోపరస మిశ్రితమగు చిఱునగవుతో వెఱ్ఱిబిడ్డలారా! పెండ్లియాడు తలంపుమీకేల గల్గినది? ఇది యె