పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    నధికవిద్యావంతులైన వారిగణించి
                    దూషింపవలయు నాధూర్తుయశము
    పరిచారికలమీదఁ బన్నిదోషములెత్తి
                    పొడుపుమాటల సూటిబొడుపవలయు

గీ. రతుల కవకాశమీక రుగ్మతవచించి
    వలపు గాడిదయొక్కటి కలదుమాకు
    నదలదెన్నన్న సిగ్గులేనిది యటంచు
    దిట్టవలెఁదల్లిచేత మొత్తింపవలయు.

క. మెల్లగవిటులకుగల ధన
   మెల్లనునమ్మించి లాగియేపున వానిన్
   వెళ్ళంగొట్టఁగ మఱితన
   తల్లిం బురికొలుపవలయు దర్పంబొప్పన్ .

బిడ్డలార! వినుండు.

శ్లో॥ పరీక్ష్య గమ్యై సంయోగ స్సంయుక్త స్యానురంజనం।
     రక్తా దర్ధస్య చాదాన మంతెమోక్షశ్చ వైశికం॥

గీ. తెలిసి విటుశీలమతనితోఁ గలసికొనుట
    కలిసి రంజించుటతని శృంగార కలన
    రక్తుఁడగువానివలన నర్ధములు గొనుట
    చివర విటుగెంటుటిదియె వైశికమనంగ.

క. ఈవైశికవిధు లెఱిగిన
   చో విటులం గపటవృత్తి జొనుపుచు రూపా
   జీవలు ధన మార్జింతురు
   ప్రావీణ్యముతోన సక్తభానంబలరన్.

అని యెఱింగించి మఱియు నపరిగ్రహానేక పరిగ్రహ ప్రవృత్తుల జెప్పుట కుద్యమించుచున్న తల్లి నాక్షేపించుచు నమ్మించుబోఁడు