పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చ. పరమదయాసమగ్ర వృషభధ్వజ భక్తజనప్రసక్త శం
    కర గిరినందినీహృదయకంజ దివాకర వాసవాదిని
    ర్జరగణమస్తకస్థగితరత్న విచిత్రవిభాలసత్పదాం
    బురుహ మహేశ ! పాపహర ! భూధరమందిర ! చంద్ర శేఖరా !

క. నీగురుకృప నీయష్టమ
    భాగము రచియించినాడఁ బావనమతి నో
    యోగినుత ! చేయు మీకృతి
    నాగగనమణీందుతారమై వెలయంగన్.

గద్య. ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదిత కవితావిచి

త్రాత్రేయమునిసుత్రామగోత్రపవిత్ర మధిరకులకలశజల

నిధి రాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండ

యార్యపుత్ర సోమిదేవీగర్భశుక్తిముక్తాఫల

విబుధజనాభిరక్షిత సుబ్బన్నదీక్షితకవి

విరచితంబగు కాశీయాత్రాచరిత్ర

మను మహాప్రబంధమున

అష్టమభాగము

సంపూర్ణము.

శ్రీశ్రీశ్రీ

శ్రీవిశ్వనాథార్పణమస్తు.