పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

377

ముల వశపఱచుకొని దుర్గముల నావరించెను.

అలర్కుం డప్పుడు తనబలంబు క్షీణించుట తెలిసికొని విషాదమే దురహృదయుండై చీకాకుపడుచు నేమిచేయుటకుం దోఁచక తటాలునఁ దల్లిమాట జ్ఞాపకము వచ్చుటయు శుచియై తనవ్రేలినున్న యుంగరము జిదియఁగొట్టి సూక్ష్మాక్షరములతో నందున్నశ్లోకముల నిట్లు చదివెను.

శ్లో॥ సంగస్సర్వాత్మనాత్యాజ్య స్సచేత్త్యక్తుం నశక్యతే
      స సద్భిస్సహకర్తవ్య తస్సంగస్య భేషజం
      కామస్సర్వాత్మనా హే యో హాతుంచే చ్ఛక్యతె న సః
      మముక్షాం ప్రతికర్తవ్య స్పవై తస్యాపి భేషజం॥

సర్వవిధములచేతను సంగము (జనులతోఁ గలిసియుండుట) విడువఁదగినది. అది విడుచుటకు శక్యముకానిచో సత్పురుషులతోఁ జేయుము; అదియే దానికిమందు. అన్నివిధములఁ గామము (కోరిక) విడువఁదగినది. అది విడుచుటకుశక్యముకానిచో ముక్తినిగుఱించి చేయుము; అదియే దానికివైద్యము. అనియున్న రెండుశ్లోకములు పలుమారు జదివి తదర్థముగ్రహించి సంగమువిడువలేకున్న సత్సంగము సేయుమని చెప్పినది. అదియే యిప్పుడు కర్తవ్యము. అని నిశ్చయించికొని యలర్కుండు తిన్నఁగా దత్తాత్రేయాశ్రమమున కరిగి యతనిచరణంబులఁబడి మహాత్మా! రక్షింపుము, రక్షింపుము. దుఃఖసముద్రములో మునిఁగియుంటి నా దుఃఖము బోఁగొట్టి రక్షింపుమని ప్రార్థించెను.

దత్తాత్రేయమహర్షి నవ్వుచు నరేంద్రా ! నీదుఃఖము తృటిలోఁ బోఁగొట్టెదను. ఆదుఃఖ మెందులకు వచ్చినదో లెస్సగా విచారించిచెప్పుము. నీవెవ్వఁడవు? దుఃఖ మెవ్వరికి? అంగాంగిభావ మెఱిఁగి పలుకుమని చెప్పిన నలర్కుం డాలోచించి యాలోచించి విమర్శించి తనలోఁదానే నవ్వుకొని యిట్లుపలికెను. మహాత్మా! నే నాకాశమును భూమియు నుదకము వాయువు తేజమునుం గాను. తత్సంఘమందుఁ బ్రవేశించి సుఖ