పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రేవతి లీలావతింజూచి పాదములవ్రాలి గోలుగోలున నేడువఁ దొడంగినది. ఆమె దానినిలేవనెత్తి కన్నులనీరుగ్రమ్మ నమ్మాయి రుక్మిణి సేమముగానున్నదా? రాజభార్యలు సుఖులైయుండిరా? విశేషము లేమి ? విచారింపకుము. రాజుగారివార్త లెట్టివి యెఱింగింపుమని యడిగిన నది కన్నీరుదుడిచికొనుచు నిట్లనియె.

అమ్మా ! రుక్మిణి సంతతము నిన్నుఁగూర్చియే విచారించుచుండును. రాజభార్యల కానందముగాక యేమి ? నిన్నడవికంపినదిమొదలు మేదినీపతి నీసదనము వదలియుండలేదు. తొందరపడి నిన్నుఁ జంపించి పశ్చాత్తాపముచెందుచున్నట్లు చెప్పికొనిరి. కాళిదాసకవినిఁ దీసికొనివచ్చునెపంబున రాజుగా రూరువిడిచి దేశములు దిరిగి తిరిగి మొన్ననే యిందువచ్చిరి. వచ్చినదాదిగా నీయంతఃపురమందే యున్నారని విన్నాను. ఇంతవఱకు రాజభార్య లెవ్వరు నాఱేనియొద్దకుఁ బోవ లేరు. పోవుటకు వెఱచుచున్నారు. అనియెఱింగించినది.

అప్పుడు లీలావతి మెల్లగా రాజు పశ్చాత్తాపము చెందియున్నాఁడని చెప్పితివి. అది యెంతనిజమో యేకాంతముగా నాభూకాంతుచెంత కరిగి తెలిసికొనిరావలయు. ఇందులకు నీకంటె నా కాప్తులు లేరు. రుక్మిణిం గౌఁగిలించుకొని ముద్దుపెట్టుకొంటినని చెప్పుము. తరువాతకర్తవ్య మాలోచింతముగాక. అని నియోగించుటయు రేవతి లీలావతికి నమస్కరించి చారాయణు ననుజ్ఞగైకొని తొలుత రుక్మిణియంతఃపురమునకుఁబోయి యావార్తనంతయుఁ జెప్పినది.

రుక్మిణి మురిపెంపుపెంపున వివశయై యంతలోఁ దెప్పిరిల్లి ముప్పిరిగొనువేడుకతో నామెపంపు గావింపుమని నియోగింప సమయమరసి యాసరసిజానన భూజానియంతఃపురమున కరిగి రహస్యముగా నందలి విశేషములన్నియుఁ దెలిసికొనివచ్చి లీలావతి కిట్లు విన్నవించినది.

అమ్మా ! నీక్షేమవార్తవిని రుక్మిణి బ్రహ్మానందము జెందుచు