పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దత్తునికథ

3

నీమార్గమంతయుఁ గాంతార భూయిష్ఠమై యొప్పుచున్నది. ఎన్నిదినములు నడచినను నీయడవికిఁదుదిమొదలు గనంబడకున్నది. తెచ్చిన యాహారపదార్థము లైపోయినవి. యెన్ని నాళ్ళు ఫలములుదిని సంచరింతును. ఎన్ని రాత్రులు చెట్టుకొమ్మలసందునఁ బండుకొందును ? వెనుకటివలెనే ప్రొద్దు గ్రుంకకపూర్వ మేచెట్టోయెక్కక నేఁడు దాపునఁ దెరపి కనంబడుటచే గ్రామముండునని యాసతోఁ బ్రొద్దుపోవువఱకు నడచితిని. ఇప్పు డంధకారబంధురంబై లతాగుల్మాదులచే నావృతమై మన్నును మిన్నును దెలియకున్నవి ఏమిచేయుదును ఈరేయిఁ గ్రింద వసించితినేని మృగములు హింసింపకమానవు. ఇది మనుష్యులు సంచరించు మార్గముగాదు. తెలియక నీత్రోవంబడితిని. భవితవ్యమెట్లున్నదో తెలియదు. అని విచారించుచు నలుమూలలు పరికించుచుండెను.

అల్లంతదవ్వులో నెత్తుగానొక దీపమతని చూపులకు మురిపెము గలుగఁజేసినది. ఒకమారు తళుక్కుమని మెఱయుచు నొకసారి మినుకుమినుకుగాఁ గనంబడుచు నొకతేప నదృశ్యమై యంతలోఁగనంబడుచున్న యాదివ్వె తేజము పరీక్షించి యతండు వెఱఁగుపాటుతో నాహా ! జనసంచార శూన్యమగు నీయడవినడుమ నీదీపముండుటకుఁ గారణమేమి? ఆ తేజమున్న తావు పర్వతమో ప్రాసాదమోకావలయును. క్రీడాసౌధంబు గట్టించుకొని యివ్వనములో నెవ్వరైన నివసించి యుండిరేమో ? జనులుండినంగాని దీపముండదు. శ్రమమైననగుంగాక ఈరేయి నాదీపమున్న తావునకుంబోయి చూచెద నేమైనను సరేయని నిశ్చయించుకొని యతం డాదీపమును లక్ష్యముగాఁ జేసికొని యా దెసకు నడుచుచుండఁ గ్రమోన్నత భూమివలన నది యొకకొండయని తెలియఁబడినది.

చేతులతో నానుచు గంటకపాషాణబాధం దప్పించుకొనుచు