పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గాఢముగా నిద్రపట్టినది. తెల్లవారి చూచువఱకు నాతరుణు లిరువురును వాకిట దింపిన బండియు బండివాఁడునుంగూడఁ గనంబడలేదు.

అప్పుడు మిక్కిలి పరితపించుచు నీ నగరమంతయు వెదకితిని. వారిజాడ యేమియుం డెలిసినదికాదు. క్రమ్మరమేము వచ్చినదారి కొంతవఱకు వెదకితిని. కార్యము లేక పోయినది. అది దైవకృతముగాఁ దలంచి పరితపించుచు మఱల నీనగరమునకువచ్చి దేవాలయ గోపుర సత్రకుడ్య భాగంబులు పరీక్షించితిని. మన మిత్రులెవ్వరువచ్చిన చిహ్నమ లేమియుఁ గనంబడలేదు. ఇందూరకుండనేలయని యొకనాఁడు ప్రాతఃకాలమునఁ బండితవేషముదాల్చి రాజదర్శనార్ధమై నగరి కరిగితిని భోజభూపతి దేశాంతరమరిగియున్న కతంబున నతని పుత్రుండు చిత్రసేనుండు పండితుల నాదరించుచున్నవాఁడని విని యతండున్న నెలవునకుఁబోయి కొన్నిశ్లోకములు రచించి స్తుతియించితిని.

రాజపుత్రుండప్పుడొక మంచముపైఁ బండుకొని యుండెను. తనకు దేహములో స్వస్థతలేదనియు నిప్పుడు మీకవితాచమత్కృతి వినుటకు సమయముగాదనియుఁ బలుకుచుఁ గొన్ని దీనారములు నాకుఁ గానుకగా నిప్పించెను. వానిని నేనందుకొనక రాజపుత్రా! నేను విత్తార్ధినై రాలేదు. మీసంస్థానమున విద్వాంసులుండిరని విని ప్రసంగింప వచ్చితిని. వాద పారితోషిక మిప్పింపుఁడు మఱియు మీదేహకృశత ముఖపాండిమముజూడ మీరోగము శరీరజన్యము కానట్టు తోచుచున్నది. ఇది శరీరజకృతమగుట నిక్కువము. ఆవ్యాధికిమందు నేనెఱుంగుదునని పలికినంత నానృపసూనుండు తెలిసికొని చెంతనున్న వారి నవ్వలికిం బొమ్మని నన్నుఁదనప్రక్కఁ గూర్చుండబెట్టికొని యిట్లనియె.

మహాత్మా! నీవు నావ్యాధి గ్రహించితివి. దీనిబాధ యిట్టిదని చెప్పఁజాలను. ప్రతీకారమెట్లు ? ఔషధమేమి ? అని యడుగుటయు నేను మెల్లగా నీవెవ్వతెంజూచి యీవిరాళిం గుంధుచుంటివి ? అది