పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనోరమ కథ

101

మెడనున్న హారంబులు సవరించుకొనబోయి కుచాంతరమున నట్టిముద్రలే యుండుట దిలకించి రవికముడి సవరించుకొనుచు తెగియుండుట దెలిసి కన్నులు వికసింప నా రాజపుత్రిక మధురిక కిట్లనియె.

బిగియంగట్టిన రవిక ముడి కత్తిరించి యిట్లు గంధ మద్దినవారెవ్వరు? నిజము చెప్పుము. నీవుకాక మఱియొకతె నాగదిలోనికి రాగలదా? ఇట్టిపనులు చేయుటకు నీకంత అవసరమేమి వచ్చినది? పరిహాసములు నిద్రలోనా? చాలులేయని యించుక అలుకదోపబలికిన విని అక్కలికి భయపడుచు సఖీ! నేనిట్లు కావించుటకు నాకు నీవు హాస్యమగుదువా! యెప్పుడైన గావించితినా? నేనేమియు నెఱుంగదక్కు గల సఖురాండైనం జేయుదురని నమ్మజాల. నిది యింద్రజాలమువలెనున్నది. వింతవారెవ్వరైన న నీయంతఃపురమునకు వచ్చి రేమో తెలియదు. దగ్గరగా రమ్ము. ఈ ముద్రలయం దక్షరము లున్నట్లున్నవి. ఓహో! ఇందు కందర్పయని యున్నది. మన్మథుడు నీరూపమునకు వలచి రాలేదుకద. ఇతరులకీ శుద్దాంతమునకు రాశక్యమా ఈరచ్చ అంతయుఁ జూడ బురుషులు గావించినట్లున్నది. కాని మఱియొకటి కాదు! అనిచెప్పగా నప్పడతియు దొందరపడుచు నాముద్రల వెండియు అద్దములో బరిశీలించి అక్షరము లుండంగని యొక్కంత యాలోచించి మధురికా! నీవు మన అంతఃపురము నలుమూలల వెదకిరమ్ము. రాత్రి క్రిందిమేడ తలుపులు వైచిరో లేదో విమర్శింపుమని యంపినది. అదిపోయి యామేడలన్నియు వెదకివచ్చి యెందును నేజాడయులేదు. క్రిందిమేడతలుపు లిప్పటికిని మూయబడియే యున్నవని చెప్పినది.

అట్టిసమయమున నారాచపట్టిక నెడమకన్ను నెడమభుజము తొడయు అదర జొచ్చినది. ఆలక్షణంబుల గ్రహించి యా రాజపుత్రి సంతసించుచు మధురికా! కానిమ్ము ఈవింత రహస్యముగా నుంచుము. యెవ్వరైనను వినినచో నవ్వుదురు. ఈరాత్రి నిద్రమేల్కాంచి యావింత పరీక్షింపవలయునని చెప్పి అప్పుడా గంధమంతయు దుడుచుకొని సాయంకాలమువరకు నావిషయమే యాలోచింపుచుండెను. రాత్రియైనతోడనే మనోరమ చక్కగా నలంకరించుకొని మధురికంజీరి సఖీ! ఈరాత్రి మనము నిద్రబోగూడదు. రాత్రివచ్చినవా డీరాత్రియు రాకమానడు భద్రముగా నుండుమని చెప్పుచు సంగీతగోష్టిచే రాత్రి పెద్దయుం బ్రొద్దు మేల్కొని పిమ్మట నిద్రకు దాళలేక మధురికా! నాకన్నులు నిలువకున్నివి. ఇక నేను మేల్కొనజాల నీవు యుండుమని చెప్పి తాను నిద్రబోయినది. మధురికయు బెద్దతడవు జాగరముచేసి యాగలేక చివరకు కునికినది.

కందర్పు డాపవలంతయు మనోరమరూపమును దనరూపమును జక్కగా నొక్కచిత్రపటంబున వ్రాసి తానే వింతగాజూచుచు రాత్రి మునుపటివలె నాసౌధం