పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

కాశీమజిలీకథలు - మూడవభాగము

విరహోత్కంఠిత, స్వాధీనపతిక. కలహింతరిత, ఖండిత, విత్రలబ్ధ, ప్రోషితభర్తృక అని యెనిమిది విధంబుల నామంబులతో నాయికలు విరాజిల్లుదురు. అందు బ్రతినాయికకును, బాల, తరుణీ (మధ్య) ప్రౌఢ వృద్ద, అనెడు నామంబులు వయోవిశేషంబునంబట్టి, యెప్పుచుండెడివి. మఱియు తత్వభేధంబులఁబట్టి స్త్రీజాతు లనేకరీతులం బ్రవర్తిల్లెడివి.

రాజపుత్రా! ధర్మార్థ కామమోక్షములని పురుషార్ధములు నాలుగు. అందు మూడవదియగు కామమునఁ గృతార్థుఁడగుటకే దీనిందెలిసికొనుటకు ఫలము.

శ్లో॥ జాతిస్వభావగుణదేశికఖర్మచేష్టా
     భావేంగితేషువికలోరసతంత్రమూఢః
     లబ్ధ్వాపిహిస్లలతియౌవన మంగనానాం
     కిం నారికేళ ఫలమాస్య కపిః కరోతి॥

జాతిస్వభావము గుణములు. దేశవిశేషములు, ధర్మములు చేష్టలు, భావములు, ఇంగితములు స్త్రీలయందీలక్షణములు దెలిసికొనుట యావశ్యకము. వీని తెఱంగెఱుంగని వాఁడు రసతంత్రమూఢుఁడని చెప్పఁబడును.

శ్లో. బాలా తాంబూలమాలా ఫలరసవర సాహార సన్మానహార్యా
    ముక్తాలంకార హార ప్రముఖ వితరణై రజ్యతె యోవనస్థా
    ....... ......... .......... ........ ......... ........ మధ్యమారాగలుబ్దా
    మృద్వాలాపైః ప్రహృష్టాభవతిగతనయాగౌర వేళాతిదూరం॥

తాంబూలమాల్యానులేపనాది మనోజ్ఞవస్తుప్రదానంబున బాలయు అలంకారప్రదానమున దరణియు మృదువులగు మాటలచే వృద్ధయు రజించును.

ఈ లక్షణంబు లెఱుంగని పురుషుఁడు కామంబున నెట్లు గృతార్థుండు కాగలడు? రాజనందనా! సర్వజనానుష్ఠేయంబైన రసపవృత్తి నీచిత్తంబునం బట్టించుచు నీ పరీక్షలోఁ కృతార్థుండవైతివేని నాగౌరవంబు నిలువఁగలదని పలికిన విని యాజయభద్రుం డాయన చెప్పిన విశేషము లనుభవముగాఁ దనమనమున కేమియు గోచరములు కాకుండుట తిలకించి తలయూచుచు నిట్లనియె.

చ. గురువర! చాలకష్టపడి కోవిదధర్మముమీర మీర లి
    త్తెరఁగున నానతిచ్చితిరి తెల్లముగాఁగ రసప్రవృత్తి స్త్రీ
    పురుషలకున్ బ్రభేదశతముల్ దగుఁగాక మృగంబులన్ ఖగో
    త్కరములలేవె భేదములు: తద్దతినొప్పెడి దీననేమగున్.

క తరుణీమణి పద్మినియై పరగినఁ జిత్తినియు నాప్తపతిగయు గలహాం
   తరితయునైనను నేమగు! గురువర! తద్విధముదెలిసికొనదెల్లముగాన్.

గీ. హావమఁట భావమఁట యనుభావమఁట వి
   భావమఁట సాత్వికంబఁట బాగుబాగు
   వీనిచే నేదొ రస ముద్భవిల్లునంట
   పేరులెన్నెన్నో చిత్తవికారమునకు!