పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(33)

హేమ కథ

265

మోహవివశనయితిని. కావున మీరే స్థితిలో నున్నవారో తెలియక మీక్షేమమరసి రమ్మని దేశదేశములకు దూతల నంపితిని ఏజాడయుం దెలిసినదికాదు. అట్లు కొన్నిదినములు గడచినవెనుక నొకనాడు భవదీయనామముద్రాంకితమయిన యుంగర మీవీటిలో నొకవైద్యు డమ్ముచుండ బట్టుకొని రాజభటులతని నాయుంగరముతో మా యొద్దకు దీసికొనివచ్చిరి. ఆయుంగరము దేవరవారిదనియు నాచెట్టుక్రింద బరుండినప్పుడు మీవ్రేల నున్నదనియు నేనెఱుంగుదును. కావున నా వైద్యుని సానుపూర్వకముగా నీకిది యెక్కడ దొరికినదని యడిగితిని౼

అతండు తానొకనాఁ డొక యరణ్యములోఁ బోవుచుండ నొక చెట్టుక్రిందఁ గత్తివ్రేటుదిని మృతప్రాయుడయి పడియున్న యొకపురుషుని బ్రతికించిన నతండది తనకు గానుకగా నిచ్చెనని చెప్పెను. ఆమాటవిని నేను బరమానందముతోఁ దర్కించి తర్కించి పలుమారడిగి యతనిమాట నిక్కువమని తోచినవెనుక నతనికి కానుకలెన్నియేని యిచ్చి యంపితిని.

ఇంతలో దైవవశంబున మాతండ్రికి మృత్యువాసన్నమగుటయు తనరాజ్య మంతయు నాయధీనముంజేసి దౌహిత్రుడెరిగిన పిమ్మట నతని పట్టభద్రుని చేయుమని చెప్పి యతండు స్వర్గస్థుడయ్యెను అదిమొదలు నేనీరాజ్యమును పాలించుచు మీరాకవేచి దేనివలనయినను మీవార్త దెల్ల మగునని యెవ్వ రేవింతవస్తువు దెచ్చినను నాయొద్దకు దెచ్చునట్లు నారాజ్యములో ప్రకటన చేయించితిని.

అట్లుండ గొన్నినెలలక్రిందట నీవీణె నొకబ్రాహ్మణుడు దెచ్చి యిది భూలోకపు వీణలపోలికగా లేదనియు దనకు వీణాపాటవము గలిగియున్నను దీని మేలగించురీతి తెలిసినదికాదని దీనికొక సత్రములో నొకబాటసారియు యమ్మెననియుం జెప్పి నాయొద్దకంపెను. నేనది విమర్శించిచూచి యందు వీరప్రతాప కుమారచంద్ర అని తీగెవలె చెక్కబడియున్న సామవర్ణంబులంజూచి చంద్రుడు సోదరుండని మీరు చెప్పియుంటిరి. కావున నతండు వచ్చినను మీవార్త దెలిసికొనవచ్చునను తలంపుతో నాబ్రాహ్మణునకు బారితోషిక మిప్పించి దీని నచ్చటనుండి యట్టిప్రకటన గావించితిని. ఆవీణాదండమే మీ దర్శనము చేయించినది. మీరాకకొరకే యిన్ని ప్రయత్నములు చేయుచుంటిని. ఇదియే నావృత్తాంత మిందొక యక్షరమయిన నసత్యములేదని యగ్ని చేతబట్టుకొని చెప్పగలను. నన్ను నిర్దుష్టరాలిగా నెంచి స్వీకరింపుడు వీనిం గజమిచ్చినది కావున మాతండ్రి వీనికి గజదత్తుడనుపేరు పెట్టెనని తనకథ యంతయుఁ జెప్పినది.

అప్పుడు విజయుండు గద్గదకంఠముతో సోమదేవభూదేవుం డెందున్నాడు. ఆయన కేమి యుపకారములు చేసితివని యడిగిన నొక యగ్రహార మిచ్చితినని చెప్పినది. ఇస్సిరో యిదియా నీవాయనకు చేసినమేలు చాలులే నీ యౌదార్యము వెల్లడియైనది. నీరాజ్యమంతయు నిచ్చినను నాపుణ్యాత్ముని రుణముతీరునా? సగము రాజ్యమయిన నీయలేకపోతివే నిన్నతడు కాపాడకపోయిన నేమయిపోదునని యాక్షే