పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

కాశీమజిలీకథలు - మూడవభాగము

కొనిపోదుము. రమ్మని పలికిన విని నేనును బయనమునకు దొందరపడుచు బుణ్యాత్ములారా? నాపట్టిని రక్షించిన సుకృతి యెవ్వడు? ఏ దేశము? ఎంతదవ్వున్నదని యడిగితిని.

అప్పుడు వారు అమ్మా! కరిపురప్రభువైన బలవర్ధనమహారాజుగారు నీపుత్రునుని రక్షించిరి ఆవీడు మూడుదినముల పయనములో నున్నదని చెప్పిరి. ఆమాటవిని నేను డెందమున దిగులు జనింప అయ్యో? అతడు మా తండ్రి యగుటంజేసి నన్ను గులటగా నెంచి శిక్షించునేమో కొలటేయుండని మనుమని దూషించకమానడు నిజము జెప్పిన నమ్మునా యని పెక్కు తెరంగుల దలచి యావిషయ మా బ్రాహ్మణునితో జెప్పితిని.

ఆ దయాళుండు పుత్రీ! నీవిందులకు వెరవకుము. నీతో నేనును వచ్చి నిన్ను నాకుతురుగా జెప్పి యతని మతిదెలిసిన పిమ్మట సమయోచితముగా నాదరించెద జింతింపకుమని పలుకుచు నా సోమదేవుడు నన్ను వెంటబెట్టుకొని నీవీటికి జనుదెంచెను.

శోకోపవాసములచే రూపు మాఱియున్నది కావున నన్నెవ్వరు గుఱుతుపట్టలేకపోయిరి. దానంజేసి యంతఃపురమునకు నేను నిరాటంకముగా బోయి యందాడుకొనుచున్న నా కుమారుని గాంచి మేనుపులకింపఁ గౌగిలించుకొని శిరము మూర్కొనుచు బెదతడవు లాలించితిని.

అట్టి యానందములోనున్న నాయొద్దకు నాబ్రాహ్మణుడు వచ్చి పుత్రీ! నీ కష్టము గట్టెక్కి నది మీ తండ్రి భార్యమాట విని నిన్ను దుష్టురాలిగా నెంచి నిన్ను వెదకితెప్పించి శిక్షించుటకయి ప్రయత్నము జేయుచుండ మీరు మొదట నివసించిన యింటి యజమానుడు మీరాడుకొనిన మాటలు గోడ వెనుకనుండి వినెనట అందు మీ సవతితల్లి జేసినదారుణకృత్యము నీసుగుణత్వ తెల్లమగు చుండెను కావున నావృత్తాంతమా పురుషుండ పృష్ణుండయి మీ తండ్రి కెఱింగించెను! ఆకథ వినినదిమొదలు నీ తండ్రి నీవృత్తాంతము తెలిసికొని రమ్మని నలుమూలలకు దూతలంబుచ్చెనట నీ కొరకు మిక్కిలి విచారించుచున్న వాడట నీ గుణములే కొనియాడునట భార్యను కారాగృహప్రాయమైన యింటిలో నునిచి నిజము చెప్పుమని నిర్బంధించుచున్న వాడట. కావున నీవృత్తాంత మాయనతో జెప్పి యచ్చటికి దీసికొని వచ్చెదనని చెప్పిన నేనును సమ్మతించితిని.

అప్పుడాయన వెళ్ళి ఏమిచెప్పెనో గోలుననేడ్చుచు మా తండ్రి నాయొద్దకువచ్చి నాపైబడి పెద్దతడవు విచారించెను. అతనింజూచుటచే నాకును వెఱ్ఱిదుఃఖము వచ్చినది. మమ్మునోదార్చుచు సోమదేవుండు నాశీలము గురించి మాతండ్రియొద్ద నెక్కుడుగా స్తుతిచేసెను.

అప్పుడతండు నా వృత్తాంతమంతయు నావలనం దెలిసికొని మా సవతితల్లిని చంపబోయెను. కాని నేను వారించితిని. మీకంఠంబున కత్తియుండుట జూచినంతనే