పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కాశీమజిలీకథలు - మూడవభాగము

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీ కథలు

మూడవ భాగము

ఇరువదినాలుగవ మజిలీ

క. శ్రీమదగణ్యప్రావీణా'! మునిమానసవివాసః నానాభువన
   స్తోమావన నిరతగిరీశా ముక్తిదః భక్తపరవశా! పరమేశా

వ. దేవా ! యవధరింపు మట్లు త్రిభువనప్రసిద్ధుడైన మణిసిద్ధుండు కాశీయాత్రా
    ప్రమోదిత హృదయుండై శౌనకుండను గోపకుమారునితో నరుగుచు నొక్క
    నాడొక్కపట్టణంబున నివసించి నిత్యక్రియాకలాపంబు దీర్చుకొని భుజిం
    చిన పిమ్మట అద్భుతవిషయంబులంజూడ నెందేని జనిన శిష్యునిజాడ అర
    యుచున్న సమయంబున వాడొక మూలనుండి యత్యాతురముగా అరుగు
    దెంచి యెదురనున్న ఆయ్యవారింగాంచి నమస్కరించుచు--

గీ. చిత్రమిది చిత్రమిది సువిచిత్రమిదియ
    చిత్రమిది చిత్రమిది కడుచిత్రమిదియ.

అను పద్యవిశేషమును జదివెను. అమ్మహానుభావుండది విని నవ్వుచు ఏమిరా ? నీకు గవిత్వము వచ్చినదాయేమి? పద్యముగా జెప్పుచుంటివి? ఇంతదనుక నెందుంటివి? నీవు చూచిన యాచిత్ర మెట్టిది? ఎప్పుడు వీధికిబోయిన నూరక రావుగదా? అన్నము చల్లారిపోవుచున్నది. కుడువలెమ్మని పలికిన విని గోపాలుండు మెల్లన నిట్లనియె.

స్వామీ! మీకటాక్షంబు నాపయింగలిగియుండ నేను గవినగుట అబ్బురమా? వినుండు. నేనీవీటి వింతలజూడ అరుగుచు దేవాలయంబునకుం బోయితిని. కొందరు బుద్ధిమంతు లందొక శిలాశాసనంబు జదువ నెక్కుడు ప్రయత్నముచేసి కొరకుపసరు విశేషంబునంజూడ జివరనున్న రెండుపాదములు మాత్రము వారికి దెలిసినవి మొదటి పాదము లెంతప్రయత్నము జేసినను విశదమైనవి కావట. వారీ రెండుపాదములు జదువుచు అందలి విచిత్రయేమియో యని సందియమందుచు దెలిసికొనలేక పోయిరి. నేనాపాదములు వల్లించుకొని మీ యొద్దకువచ్చి వానినే చదివితినిగాని ఇది నాకవిత్వముకాదు. అది యెట్లుండె. ఈ పాదములంబట్టిచూడ దక్కుగల పద్యమం దెద్దియో విచిత్రవిషయంబు వర్ణింపబడి యున్నట్లు తోచుచున్న యది త్రికాలవేదులైన మీకాపద్యము చదువుట సులభముకదా. కావున నన్ననుగ్రహించి యాపద్యంబు