పుట:Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యీకథను నవ్వుతూ చెప్పి అక్కడివారిని నవ్వించిరి.

మర్నాడు రామయ్యగారు ఆవేషముతోనే సంగీతశాలకు వెళ్లిరి. అక్కడివారు తనకు హద్దుమీరి చేసినఆదరము నిశ్చయముగా తనగౌరవము గుర్తించి చేసినదిగానే ఆయన తలచుకొన్నాడు.

"అయ్యా మీకు మైసూరుమహారాజుగారిచ్చేటప్పుడే ఉన్నయ్యా దుస్తుల కీచిమటపోట్లని_వారు కుట్టించేప్పుడు మీశరీరముకొల్త తీసుకోలేదు కాబోలునని_ పెద్దలైనారు గనుక శరీరము కృశించినదిరా అని_అయితే అప్పటిపాటకు కూడా కృశింపే ఉంటుందేమోనని_కొంచెము పాడించిచూస్తే తెలుస్తుందని_తలకొకమాట చొప్పున పలుగురూ పగలబడి మాటాడిరి. ఒకడు "చిత్తము మైసూరు విద్వాంసులు! ఒకకీర్తనపాడండి బాబూ!" అంటూ హార్మోనియము శ్రుతి సాగించెను. 'ఇస్సీ! నేను పాడను. మంచితంబూరాశ్రుతి ఉండవలెనుగాని పాడుమ్రోత హర్మోనియముశ్రుతి పనికిరా'దని ఆయన గర్హించెను. వారందరు ఆయనచే పాడించి తాళం పట్టించదలుచుకొన్నారుగాని తంబూరా లేకపోవడముచేత అది సాగలేదు. "తాతగారు! మరొకనాడు దయచేయండి. తంబూరా తెప్పించి పెట్టుతాము" అనిరి. "మోటుశ్రుతి హార్మనీ సన్నవడిగాత్రపాటకు పనికిరాదు నాయనలారా! ఆశ్రుతమానివేయండి. మీకు దివ్యమైన కర్ణాటగానము నేర్పుతాను. మీరు కుఱ్ఱవాళ్లు, కాగలవాళ్లు. నేను పెద్దవాణ్ణయినాను. నావిద్యమీదగ్గర నాటిపోవలెనని ఆశఉన్నది. శ్రీరాజాగారితో మనవిచేస్తే మీతో ఆలోచించి సెలవిస్తామన్నారు. నావల్ల మీకు ప్రఖ్యాతి వస్తుంది. అనుకూలంగా చెప్పండి. నాసంగతి నాపాట ఒకసారి వింటే మీకే తెలుస్తుంది."అనిచెప్పి రామయ్యగారు మరొకనాడు తంబురాశ్రుతిమీద పాడుటకు నిశ్చయించుకొని యింటికి వచ్చిరి. తర్వాత రెండుమూణ్ణాళ్లు రాజాగారిదగ్గరకు, సంగీతశాలకు, తిరిగినారు. కాని రామలక్ష్మణులు శూర్పణఖను త్రిప్పినట్లు అక్కడనుండి యిక్కడికి యిక్కడనుండి అక్కడికి త్రిప్పుటేగాని పాటవినే యేర్పాటు వారు చేయలేదు.

బెజవాడ తూర్పువైపున బందరురైలు దారిప్రక్కనున్న పెద్దపువ్వుతోటలో ఒకనాడు సాయంకాలము నాలుగుగంటలవేళ పది పన్నెండేళ్ల ప్రాయముగల బాలికలిద్దరు పూలుకోస్తూ చెళ్లు కట్టుకొంటూ ఉండిరి. ఆ తోటలో పెద్దసంపెంగపొద జీబుగా అల్లకొని ఉన్నది. సన్నినిత్రోవ ఒక్కటేదానిదగ్గరకు ఇరుకుగా ఉన్నది.