పుట:Kanyashulkamu020647mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(లుబ్ధావధాన్లు ప్రవేశించును.)

లుబ్ధా-- యెందుకాగావు కేకలు?

మీనా-- నాలుగ్ఘడియల రాత్రుందనగానట మూర్తం. అచ్చన్న మావఁ అంటున్నారు.

లుబ్ధా-- యిదేవిఁటండోయి, నాలుగ్గడియలపొద్దు కనుకున్నానే ముహూర్తం?

సిద్ధాంతి-- ముప్పైమూడు ఘడియలపొద్దు కనుకున్నారుకారో? మీ వెఱ్ఱులు చాలించి చప్పునకానియ్యండి మంగళాస్నానాలు. ఊళ్లో బ్రాహ్మలినందర్నీ పిలిచేశాను.

లుబ్ధా-- చంపారే! చలి!- అయితే, రావఁప్పంతులుకూడా నాలుగ్ఘడియలపొద్దుకి అనుకున్నాడే ముహర్తం? ఆయనే వొచ్చి, పెద్దిపాలెంలో లౌక్యుల్ని నాలుగ్ఘడియలపొద్దుకి రమ్మని పిలుస్తారేమో?

సిద్ధాంతి-- శతాంధాః కూపం ప్రవిశంతి. అమ్మీ, పిల్లకి స్నానం చేయించూ.

మీనా-- యిదుగో, నిమిషంలో చేయిస్తాను.

సిద్ధాంతి-- ఆడవాళ్లునయం. పెళ్లిపందిట్లో సరంజాం చూసుకుంటాను.

లుబ్ధా-- పంతులులేకుండా లగ్నం అయితే-

సిద్ధాంతి-- పంతులుకా, మీకాపెళ్లి? జంకవోడక స్నానంకానీండి.

(నిష్క్రమింతురు.)

4-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటి అరుగుమీద పసుపుబట్టలు కట్టుకుని, లుబ్ధావధాన్లు స్త్రీవేషముతో శిష్యుడు, కొందరు బ్రాహ్మలు కూర్చుని వుందురు.

(రామప్పంతులు, తాషామర్ఫా, కావిళ్లూ, చాకర్లతో, ప్రవేశించి అరుగుమీద చతికిలబడి)

రామ-- అబ్బ! ఎంతశ్రమ పడ్డానండి (నౌఖర్లతో) తాషామర్పా వూరుకోమను. బోయీలొహళ్లూ, బాజావాళ్లొహళ్లూ, వూరుచేరేటప్పటికి కోలాహలంలావుచేస్తారు. కాళ్లుపీక్కు వచ్చాయయ్యా, వెథవ పెద్దిపాలెం యంతదూరవుఁందీ! (తిరిగిచూసి) యిదేవిఁటీ పసుబ్బట్టలూ, పెళ్లికూతురుతో కలిసికూచోడవూఁను? పెళ్లికొడుకుం చేయించుకున్నావటయ్యా? ముదిమికి ముచ్చట్లులావు.

లుబ్ధా-- లగ్నానికి మీరు లేకపోయినారుగదా! అని మహా విచారపడుతున్నాను.

రామ-- (ఉలికిపడి) యేవిఁటీ! లగ్గవేఁవిఁటి?

పూజారిగవరయ్య-- లగ్నంవేళకి తమరు లేకపోయినారుగదా అని, మేం యావన్మందివీఁ విచారించాం. తమరు యేదో వ్యవహారాటంకంచేత వేళకి రాజాలినారుకారనుకున్నాం. తాము లేకపోవడంచేత సభ సొగుసే పోయింది. "నియ్యోగిలేనిసావిడి । అయ్యయ్యో వట్టిరోత, అది యెట్లన్నన్‌! వయ్యారి"--