పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇచ్చట నెలకొనియున్న సోమేశ్వరస్వామి వారి దేవాలయ ముఖ మంటపము నందు ఈ మ్యూజియమును చక్కగా నమర్చి యున్నారు.

మ్యూజియము నందు వస్తునిర్దేశన, వాటిని గురించిన విపుల వాఖ్య చేయుదురు. అందువలన ప్రతి ఒక్కరికి ఆయా వస్తువుల యొక్క లేక కళాఖండముల యొక్క ప్రత్యేకతను గుర్తించుటకు వీలగుచున్నది. ఈ విధముగా ఇచ్చటి శిల్పముల నామము, వాటిని ఎచ్చట నుండి సేకరించినది, ఏకాలము నాటివి, మొదలగుగా గల విశేషములను విపులకీరించి యున్నందు వలన ప్రేక్షకులయందు జిజ్ఞాసను రేకెత్తించును. ఇచ్చట పరిపాలించిన వివిధ రాజ వంశములు, అప్పటి శిల్ప కళారీతులు మొదలుగాగల విషయముల గురించి క్షుణ్ణముగా పరిశీలించు ఆసక్తిని చూపుదురు.

మ్యూజియంనందు ప్రదర్శింపబడు వస్తువులను గూర్చి తెలుసు కొనుటకును, వాటిపై విపులముగా పరిశోధించుటకును మంచి వాతావరణము, అనుకూల పరిస్థితులు ఏర్పరచవలయును. అప్పుడే ఆ మ్యూజియంను దర్శించు ప్రజల సంఖ్య అధికమగును. ఆ మ్యూజియం యొక్క పేరు పైకి వచ్చును. ఆ విధముగా చూచిన కొలనుపాక మ్యూజియంకు కొన్ని ప్రత్యేక అనుకూల పరిస్థితులు కలవు. ఇది ఇచ్చట సోమేశ్వర స్వామి వారి దేవాలయ ముఖ మంటపమందు ఏర్పరచబడినందున కలిగినది. ప్రస్తుతః ఈ దేవాలయము పశ్చిమ చాళుక్యుల కాలమునాటిది. అనగా క్రీ. శ. 11 లేక 12 శతాబ్దము నాటిది. ఆపైన ఈ దేవాలయము ఇప్పటికినీ పూజా పునస్కారముల నందుకొను చున్నది. అందువలన ఎల్లవేళల దైవ దర్శనమునకై ప్రజలు వచ్చు చున్నారు. ఈ దేవాలయ సమీపముననే గల శ్వేతాంబర జైన దేవాలయమునకు దేశపు నలుమూలలనుంచీ యాత్రికులు ఎల్లవేళలా తీర్థప్రజగా వచ్చు చున్నారు. ఆ వచ్చిన వారందరూ సామాన్యముగా సోమేశ్వర స్వామి వారి దేవాలయమును, అచ్చట మ్యూజియంను చూచుటకు వచ్చెదరు. పూర్వకాలమున ఇది రాజ ప్రతినిధి స్థావరము.[1] అందువలన చరిత్రకు సంబంధించిన అనేక విషయములు ఇచట లభ్యమగుచున్నవి. ఆ విషయముల గిరుంచి తెలుసుకొనగోరి చరిత్ర పరిశోధన చేయుటకై పరిశోధకులు వచ్చుచున్నారు. శిల్ప విశేషములను, అందలి ప్రాంతీయ విభేదములను పరీక్షించుటకు ఎక్కువ అవకాశము కలదు. సోమేశ్వరస్వామి వారి దేవాలయ శిల్పములు, కుడ్య ప్రతిమలతో కలిసిపోయి యున్న మ్యూజియం శిల్పములు చూచిన మనకు మిక్కిలి ఆనందము కలుగును.

ఈ అనంత కాల స్రవంతిలో అనేక మంది మహారాజులు, రాజులు, ధనవంతులు, ఒక్కరననేల ప్రతి ఒక్కరూ, తమకు తోచినంత, తమ అంతస్తుకు తగినటుల ఇక్కడ

  1. మనకు తెలిసినంతవకూ కళ్యాణి చాళుక్యుల కాలము వరకూ ఇది రాజప్రతినిధి స్థావరము. కాకతీయుల కాలము నుంచీ మాత్రమే ఇది రాజప్రతినిధి స్థావరము కాదు.