పుట:Jyothishya shastramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ మేషలగ్నాధిపతియైన కుజ గ్రహమునకు, ఏడవస్థానమైన తులా లగ్నాధిపతి శుక్రగ్రహము పూర్తి బద్దశత్రువుగా వ్యవహరిస్తున్నది. అలాగే శుక్రగ్రహమునకు ఏడవస్థానములో కుజగ్రహమే అధిపతిగా ఉండుటవలన, సూత్రము ప్రకారము శుక్రునకు కుజుడు కూడ బద్దశత్రువే నని తెలియుచున్నది. పైనుంచి క్రిందికి చూచినా, క్రిందినుండి పైకి చూచినా ఎటుచూచినా, సూత్రబద్దముగా కుజునకు బద్దశత్రువు శుక్రుడు, శుక్రునకు బద్దశత్రువు కుజుడుగా తెలియుచున్నది. ఒక వర్గములోని ఆరు గ్రహములు మరొక వర్గములోని ఆరు గ్రహములకు శత్రువులైనప్పటికీ, అందులో ఒక పేరుగల గ్రహమునకు, మరొక పేరుగల గ్రహము ప్రత్యేకించి పెద్ద శత్రువుగా ఉన్నదని తెలియుచున్నది. అందులో విచిత్రమేమంటే 1×7 అను సూత్రము ప్రకారము ఒకవైపునుండి ఒక గ్రహమునకు మరొక గ్రహము బద్దశత్రువైతే, మరొకవైపునుండి శత్రువైన ఏడవగ్రహమునకు మొదటి గ్రహమే తిరిగి బద్దశత్రువగుచున్నది. పండ్రెండు గ్రహములలో శత్రు మిత్రులను విడదీయుటకు 2:1 సూత్రము ఉపయోగపడితే, ఎవడు ఎవరికి బద్దశత్రువు అని తెలియుటకు 1×7 అను సూత్రమును ఉపయోగించి చూడాలి.

ఇపుడు వృషభ లగ్నమునకు అధిపతియైన మిత్ర గ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము బద్ద శత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 23వ పటములో తెలుసుకొందాము.

ఇక్కడ వృషభ లగ్నాధిపతియైన మిత్ర గ్రహమునకు బద్దశత్రువు భూమి అని తెలియుచున్నది. అలాగే భూమికి బద్దశత్రువు మిత్రగ్రహమనియే తెలియుచున్నది. 1×7 అను సూత్రము ప్రకారము ఒకమారు బద్ద శత్రువులుగా మారిన గ్రహములు వారు ధర్మబద్దముగా ఎల్లపుడు ఒకరికొకరు