పుట:Jyothishya shastramu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాకినా అతనికి స్వంత గృహముండును. అట్లు గ్రహచారము మంచిగ లేని వానికి స్వగృహముండదు.

18) మీరు మూడు కొత్త గ్రహములను గురించి చెప్పారు. వాటి ప్రభావము అందరిమీదా ఉంటుందా? లేక కొందరిమీదనే ఉంటుందా?

జ॥ అందరిమీదా సమానముగా వాటి ప్రభావముంటుంది. కొందరి మీద వాటి ప్రభావముండి కొందరి మీద ఉండదనుటకు అవకాశమేలేదు. ఇంతవరకు ఏ గ్రహమూ అట్లు ఉండలేదు. అన్ని గ్రహములు అందరికీ సమానముగా ఉన్నాయి.

19) క్రొత్త గ్రహములను అందరూ ఒప్పుకుంటారా? మీ మాట సత్యమని నమ్ముతారా?

జ॥ ఒప్పుకోవడమూ, ఒప్పుకోక పోవడమూ నాకు సంబంధములేదు. నా మాట సత్యమని కూడా నేను చెప్పను. దేవుడు చెప్పిన జ్ఞానాన్నే కొందరు ఒప్పుకొంటున్నారు. కొందరు ఒప్పుకోవడములేదు. అటు వంటపుడు దేవుని జ్ఞానాన్నే ఒప్పుకోని వారున్నప్పుడు, నా జ్ఞానాన్నిగానీ, నా సూత్రములనుగానీ ఒప్పుకోమని నేను చెప్పడము లేదు. తెలుసుకోండి యని, ఆలోచించండని మాత్రమే చెప్పుచున్నాము.

20) పదిహేను రోజుల క్రిందట హైదరాబాద్‌ హైవే మీద బస్సు అంటుకొని కాలిపోయింది. అందులో 44 మంది చనిపోవడము జరిగినది. డ్రైవర్‌ క్లీనర్‌ తప్ప వారితోపాటు తప్పించుకోగల్గిన ఇద్దరికీ కూడా కొద్దిగ కాలడము జరిగినది. తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు పోతూవున్న బస్సుకు కొద్దిగా ప్రమాదము జరిగి అంతమంది చనిపోవడము జరిగినది