పుట:Jyothishya shastramu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16) కొందరు ఎంత సంపాదించినా చివరకు డబ్బులతో ఇబ్బంది పడుచుందురు. ఎప్పుడూ అప్పులలో కూరుకుపోయివుందురు. అదెందుకు జరుగుచున్నది?

జ॥ ‘‘ధనమూల మిదమ్‌ జగత్‌’’ అని కొందరనుచుందురు. ప్రతి దానికీ ధనమే మూలమైనదిగా కనిపించుచుండినా, ధనమునకు మూలము శుక్రగ్రహము మరియు గురుగ్రహమని చెప్పవచ్చును. గురుగ్రహము డబ్బును నిలువజేసి ధనికులను చేయును. శుక్రగ్రహమైతే డబ్బును నిలువ చేయక ప్రవాహములాగ కదలించుచూ డబ్బు ద్వారా అన్ని సుఖములను అనుభవింపజేయును. అందువలన కదలే డబ్బుకు శుక్రగ్రహము, కదలని డబ్బుకు గురుగ్రహము అధిపతులుగాయున్నారు. ఈ రెండు గ్రహములు వారి జాతకములో వ్యతిరేక స్థానములలో ఉండినా, వ్యతిరేక గ్రహములతో కలిసినా డబ్బు వస్తున్నా అది తమవద్ద నిలువక అవసరములకు తక్కువ వస్తూ ఇబ్బంది పడవలసివచ్చుచుండును. గురు, శుక్రులు జాతకునకు అనుకూలముగాయుండిన అంటువంటివారు డబ్బుతో ఏ ఇబ్బందులూ పడకుండా బ్రతుకుచుందురు.

17) కొందరు పేదవారైనా వారికి స్వంత ఇల్లు ఉండును. కొందరు ధనికులైనావారికి స్వంత ఇల్లు ఉండదు. దానికి కారణమేమి ఉండవచ్చును.

జ॥ స్వంత ఇల్లుగానీ, స్వంత భూములుగానీ అన్నియు స్థిరాస్తులు అనబడును. స్థిరాస్తులకు స్థానము జన్మకుండలిలో నాల్గవ స్థానము. అక్కడ ఒక శుభగ్రహమున్నట్లయితే అతనికి స్వంత ఇల్లు మొదలగు స్థిరాస్తులు కల్గును. అక్కడ అశుభగ్రహముండినట్లయితే స్వంత స్థిరాస్తులు ఏమీ ఉండవు. జాతకములో నాల్గవ స్థానములో ఒక మంచి గ్రహమున్నా లేక